ఆంధ్రప్రదేశ్‌లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రస్తుతం కొలువుదీరిన ప్రభుత్వం అయిదేళ్ల పాటు అధికారంలో ఉండే పరిస్థితి ఉండదా? అంటే కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆ తరహా అభిప్రాయం కలుగుతోంది. ఇది చాలా పెద్ద మాట! కేంద్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీయే(NDA) ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందే బీజేపీ చాలా స్పష్టంగా ఒకే దేశం- ఒకే ఎన్నిక అమలు చేస్తామని చెప్పింది. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచింది. జమిలి ఎన్నికలు తమ విధానామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేసి తీరతామని ప్రకటించింది. జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్ర పక్షాలన్ని మద్దతు పలుకుతున్నాయి. వ్యతిరేకించే పార్టీ కనిపించడం లేదు. తెలుగుదేశంపార్టీ(TDP)కి సంబంధించినంత వరకు ఆ పార్టీ స్టాండ్‌ ఏమిటో ఇప్పటి వరకు తెలియదు. జనసేన పార్టీ(Janasena Party) మాత్రం వన్‌ నేషన్‌- వన్‌ ఎలెక్షన్‌కు(One Nation One Election)సపోర్ట్ చేస్తోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Home Minister Amit Shah)ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. తమ పదవీకాలం పూర్తయ్యేలోపుగానే తాము జమిలి ఎన్నికలు జరుగుతాయంటూ ఆయన చెప్పారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 2029 వరకు అధికారంలో ఉంటుంది. 2029 కంటే ముందే జమిలి ఎన్నికలు జరుగుతాయని అమిత్ షా చెప్పారు. ఈ లెక్కన 2029 కంటే ముందే ఎన్నికలు జరుగుతాయన్నమాట! పైగా వన్‌ నేషన్‌- వన్‌ ఎలెక్షన్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం కూడా లభించింది. వచ్చే శీతాకాలపు పార్లమెంట్‌ సమావేశాల్లో సభ ముందు దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు కూడా! వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం దీనిపై చర్చ మరింత తీవ్రస్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. 2029 కంటే ముందే ఎన్నికలు జరగవచ్చని అనిపిస్తోంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయి. అయితే జమిలి ఎన్నికలను ఎలా నిర్వహిస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ehatv

ehatv

Next Story