కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అమిత్ షాకు చంద్రబాబు నివాసంలో విందు ఏర్పాటు చేశారు.

కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అమిత్ షాకు చంద్రబాబు నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, కేంద్రమంత్రి బండి సంజయ్‌, బీజేపీ నేతలంతా విందులో పాల్గొన్నారు. ఈ విందు సమావేశంలో జరిగిన చర్చపే ప్రధాన పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో జగన్‌ ప్యాలెస్‌ల గురించి విని అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఏంటా ప్యాలెస్‌లు అని అమిత్ షా అంటే.. హైదరాబాద్‌లో 100 గదులతో జగన్‌ ప్యాలెస్ కట్టుకున్నాడని చంద్రబాబు చెప్తే.. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట అమిత్ షా. విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడని చంద్రబాబు చెప్తే.. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట అమిత్ షా.. అంతేకాకుండా బెంగళూరులో 36 ఎకరాల్లో జగన్‌ ప్యాలెస్ కట్టుకున్నాడని చెప్తే.. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట అమిత్ షా.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అంశాలను చర్చించనేలేదా.. ఏపీలో ఉన్న సమస్యలపై ఎందుకు మాట్లాడలేదో..సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!


ehatv

ehatv

Next Story