అమరావతి పనులకు టెండరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అనేక పనులకు సంబంధించిన ప్యాకేజీలను కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది.

అమరావతి పనులకు టెండరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అనేక పనులకు సంబంధించిన ప్యాకేజీలను కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. వేల కోట్ల కాంట్రాక్టులకు సంబంధించిన పనులను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లకు, టీడీపీ(TDP) ముఖ్యనాయకుల బంధువులకు, తెలుగుదేశం నాయకత్వానికి సన్నిహితంగా ఉన్నవారికే దక్కిందని సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది. సాక్షి వైఎస్‌ఆర్సీపికి సంబధించిన పత్రిక, వైఎస్‌ర్సీపీ (Ysrcp)ఐడియాలజీనే ప్రచురిస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి ఏ టెండర్ దక్కింది, ఎవరు ఎంతకు కోట్‌ చేశారు, ఎవరికి టెండర్లు అప్పజెప్పారనేది డీటెయిల్డ్‌గా ప్రచురించింది. సాధారణంగా గ్లోబల్ టెండర్లు పిలిచినప్పుడు ఎవరు లెస్‌కు కోట్‌ చేస్తారో వారికే టెండర్లు కట్టబెడతారు. అయితే అమరావతి(Amaravathi)కి సంబంధించిన ప్యాకేజీలను మాత్రం ఎక్సెస్‌కు కోట్ చేశారు. ఎన్నికోట్లకు ఈ ప్యాకేజీ చేయాలో ప్రభుత్వం ఒక అమౌంట్‌ ఇస్తే దానికంటే లెస్‌కు వేసినవారికి టెండర్లు కేటాయిస్తారు. కానీ ఇక్కడ ఎక్సెస్‌కు కోట్‌ చేసిన వారికి టెండర్లు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్‌ విధానాన్ని తీసుకువచ్చారు. టీటీడీ(TTD) నుంచి పోలవరం(polavaram)వరకు అన్ని ప్యాకేజీలను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేటాయించారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటే ఎవరైతే లెస్‌కు కోట్‌ చేస్తారో వారిని ఎంపిక చేసి మళ్లీ దాన్ని రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇంకా ఎవరు తక్కువకు కోట్‌ చేస్తారో వారికి పనులు అప్పగించడం. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గత ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ను రద్దు చేసింది. అసలు ఎక్సెస్‌కు కోట్‌ చేసిన వారికి అమరావతి ప్యాకేజీ పనులకు ఎందుకు కేటాయించింది ప్రభుత్వం.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story