Journalist YNR Analysis :రేషన్ బియ్యం కథాకమామిషు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం చుట్టూ రచ్చ జరుగుతోంది. 'ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం చుట్టూ రచ్చ జరుగుతోంది. 'ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు. ఇలా తరలించడం కోసం కాకినాడ పోర్టు ఒక కేంద్రంగా మారింది. కాకినాడ పోర్టు నుంచి తరలించిన రేషన్ బియ్యాన్ని వేరే దేశాలలో కిలో 70 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. దీని వల్ల నష్టం జరుగుతోంది. ఈ అక్రమ రవాణాను ఆపాలి. ఈ అక్రమ రవాణా వెనక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు' ఇవి కూటమి నేతల నుంచి వస్తున్న మాటలు! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాలలో రేషన్ బియ్యం తరలింపుపై చర్చలు జరిగాయి. కాకినాడ పోర్టు నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చాలా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విదేశాలకు పంపుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ రేషన్ బియ్యం విదేశాలకు ఎలా వెళుతుంది? రేషన్ బియ్యాన్ని ఇంటింటికి తిరిగి అందిస్తుంటే, పోర్టు వరకు ఎలా వెళుతున్నది? ఎందుకు వెళుతుంది? పేదవాళ్లకు తక్కువ ధరకు బియ్యం ఇవ్వడం కోసం ప్రభుత్వం పెట్టిన పథకం ఇది. ఆహార భద్రత కోసం పెట్టిన పథకం. ఈ పథకం ద్వారా పేదలకు చెందాల్సిన బియ్యం వందలు వేల టన్నులు విదేశాలకు తరలిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యాన్ని ఎవరూ వండుకుని తినడం లేదు. చాలా ఏళ్ల నుంచే ఎవరూ తినడం లేదు. పది పదిహేనేళ్ల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలి వెళుతున్నది. తెలంగాణ నుంచి కూడా రేషన్ బియ్యం తరలివెళుతున్నది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? బియ్యం అక్రమ రవాణా జరగడం వల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది? దీనికి ఎవరు అడ్డుకట్ట వేయాలి?