Analysis On Allu Arjun Arrest: అక్రమ అరెస్టు!
శుక్రవారం ఉదయం నుంచి అల్లు అర్జున్ అరెస్టు, ఆయనకు రిమాండ్ ఆ తర్వాత బెయిలు అటు పిమ్మట విడుదల ప్రహసనం నడుస్తూ వచ్చింది.
శుక్రవారం ఉదయం నుంచి అల్లు అర్జున్ అరెస్టు, ఆయనకు రిమాండ్ ఆ తర్వాత బెయిలు అటు పిమ్మట విడుదల ప్రహసనం నడుస్తూ వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టు అయినప్పటి నుంచి కేసు కు సంబంధించి రకరకాల వెర్షన్లు, రకరకాల వ్యాఖ్యానాలు విన్నాం. హఠాత్తుగా శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్టు అన్న బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అరెస్టుకు సంబంధించి మీడియా లో ఎలాంటి చర్చా లేదు. అల్ ఆఫ్ సడెన్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. ఆయనను అరెస్టు చేశారు. తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే! అయితే అల్లు అర్జున్ అరెస్టు కు సంబంధించి రకరకాల వాదనలు వినిపించాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. అయితే ఈ కేసు విషయం లో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ అరెస్టు అక్రమమా? సక్రమమా? సమర్థనీయమా? వంటి ప్రశ్నలు కూడా తలెత్తాయి. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్ళారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేయకూడదు అని చాల మంది అనుకున్నారు.పోలీసులు పెట్టిన అభియోగం నిజమే అయినప్పుడు అరెస్టు చేస్తే తప్పేమిటి అని భావించారు. సెలబ్రెటీ కి ఒక రూలు , సామాన్యులకు ఒక రులు ఉండకూడదు అని అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అల్లు అర్జున్ అరెస్టు అక్రమము అని రుజువు అవుతోంది. ఈ బెనిఫిట్ షో కి అనుమతి ఇచ్చిందే ప్రభుత్వం. పోలీసుల అనుమతి తోనే సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేశారు. బెనిఫిట్ షో వేస్తున్నారు అన్న విషయం పోలీసులకు తెలుసు. ప్రభుత్వం ఎరుకలో కూడా ఉంది. సో ప్రభుత్వం అనుమతించించిన ఒక కార్యక్రమానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళుతున్న క్రమం లో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక అక్కడికి వస్తున్నారు అన్న విషయం థియేటర్ యాజమాన్యానికి తెలుసు. ఆ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులకు థియేటర్ యాజమాన్యం తెలిపింది. రాత పూర్వకంగా! ఏసిపి సంతకం తో కూడిన అక్ నాలెడ్జ్ మెంట్ కూడా తీసుకుంది. పోలీసులను పర్మిషన్ అడిగిన మాట నిజం. బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరిన మాట నిజం. అలాంటి అప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పు ఏమిటి? బెనిఫిట్ షో లకు హీరోలు వెళ్ళడం అన్నది కొత్తేమీ కాదు. ఇంతకు ముందు చాలా మంది హీరోలు వెళ్ళారు. అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నాడు అన్న సంగతి అందరికి తెలుసు. జాతీయ మీడియాకు కూడా తెలుసు. మరి పోలీసులకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంటెలిజెన్స్ ఏమి చేస్తుంది?