తెలుగు భాష(Telugu Language) సుమారు క్రీ. పూ. 400 క్రితం నుంచి ఉంది. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా International Alphabet Association ద్వారా ఎన్నుకోబడింది. మొదటి లిపిగా కొరియన్ భాష(Korean) నిలిచింది. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరంలో 72000 నాడులు(Nerves) ఉత్తేజితమవుతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలిన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ. శ్రీలంకలో ఉండే జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడుతారు. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడుతారు. ఇటాలియన్ భాష మాదిరిగానే తెలుగు భాషలో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ (Italian Of the East) అని అంటారు.

Telugu Language
తెలుగు భాష(Telugu Language) సుమారు క్రీ. పూ. 400 క్రితం నుంచి ఉంది. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడింది. మొదటి లిపిగా కొరియన్ భాష(Korean) నిలిచింది. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరంలో 72000 నాడులు(Nerves) ఉత్తేజితమవుతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలిన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ. శ్రీలంకలో ఉండే జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడుతారు. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడుతారు. ఇటాలియన్ భాష మాదిరిగానే తెలుగు భాషలో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్"(Italian Of the East) అని అంటారు.
భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. మన దేశంలో మూడో స్థానాన్ని, ప్రపంచంలో 15వ స్థానంలో తెలుగు ఉంది. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చినట్లు చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగ క్షేత్రాలు నైజాం ప్రాంతంలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం మధ్యలో వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని అంటారు. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తి అవుతుంది. తెలుగు భాషలో వున్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోనూ లేవు. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.
భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు. 200 సంవత్సరాల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతివారే కావడం గమనార్హం. రామాయణ, మహభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలోనూ లేదు. కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.
శ్రీకృష్ణ దేవరాయలు 'ఆముక్త మాల్యద' అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేసాడు. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది ఆనడంలో ఏమాత్రం సందేహం లేదు.
