టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ సహా సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌(TSPSC) సహా సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా పత్రాలు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ www.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు [email protected]కు మెయిల్‌ చేయాలి. చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాల కొరకు అధికారిక వెబ్‌సైట్‌‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఇదిలావుంటే.. తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt).. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే యూపీఎస్సీ(UPSC) తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) ను మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గత పాలకమండలి సభ్యులు రాజీనామా చేయగా.. వారి స్థానంలో కొత్త సభ్యుల నియామకానికి ప్ర‌భుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Updated On 12 Jan 2024 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story