Samantha- Chaitanya divorce : నా తప్పేం లేదు..ఎందుకు భయపడాలి.. చైతన్యతో విడాకులపై ఓపెన్ అయిన సమంత
విడాకుల విషయంలో మారోసారి స్పందించారు హీరోయిన్ సమంత(Samantha). ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విడాకుల గురించి బ్లాస్ట్ అయ్యారు శ్యామ్.. అసలు విడాకులకు తాను ఎంత మాత్రం కారణం కాదు అంటుంది సమంత.
విడాకుల విషయంలో మారోసారి స్పందించారు హీరోయిన్ సమంత(Samantha). ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విడాకుల గురించి బ్లాస్ట్ అయ్యారు శ్యామ్.. అసలు విడాకులకు తాను ఎంత మాత్రం కారణం కాదు అంటుంది సమంత.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన సమంత(Samantha) తన విడాకులు గురించి మరోసారి బరస్ట్ అయ్యారు. అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya) తో ప్రేమలో పడి చాలా కాలం సీక్రేట్ గా ప్రేమించుకున్న ఈ జంట.. 2017 ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ముచ్చటగా మూడేళ్లు కూడా సరిగ్గా కాపురం చేయకుండానే విడిపోయి.. విడాకులు తీసుకున్నారు ఈస్టార్ కపుల్. అయితే విడాకులు తీసుకున్నప్పటి నుంచి.. నాగచైతన్య మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. కాని సమంత మత్రం తన బాధను ఇండైరెక్ట్ గా వ్యాక్తపరుస్తూనే వచ్చింది. రీసెంట్ గా మరోసారి ఈ విషయంలో మరో సారి స్పందించిన సమంత.
శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది సమంత(Samantha). ఏప్రిల్14న శాకుంతలం సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈక్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు మూవీ టీమ్. సమంత కూడా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈక్రమంలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది సమంత(Samantha). తన పెళ్లి విడాకులపై ఓపెన్ అయ్యింది. సమంత(Samantha) మాట్లాడుతూ.. నేను కరెక్ట్ గానే ఉన్నారు. భార్యగా ఎలా ఉండాలో అలానే ఉన్నాను. కాని నన్ను ఇంట్లో కూర్చోపెట్టాలి అనుకున్నారు అంటూ కామెంట్స్ తో మంటలు రేపారున
భార్యగా నేను వంద శాతం కరెక్ట్ గా ఉన్నానని అయినా సరే తప్పు నాది అన్నట్టుగా ప్రచారం జరిగిందన్నారు సమంత(Samantha). అంతే కాదు విడాకులైన కొత్తల్లో పుష్ప కోసం ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. దానికి నేను సైన్ చేశాను. కాని నా బంధువులు, సన్నిహితులు వద్దంటూ.. దీన్ని వ్యతిరేకించారు ఈ సాంగ్ చేయకని వారించారు. నీకు విడాకులైంది అప్పుడే కాబట్టి.. ఇప్పుడు ఊ అంటావా మామా సాంగ్ చేస్తే.. జనాల్లో తప్పుడు అభిప్రాయం పోతుంది అంటూ..నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అంది సమంత.
కాని నేను వినలేదు. తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడను.. ఈసాంగ్ చేయాలి అనుకున్నాను.. చేశాను. ఇంట్లో కూర్చుని ఏం చేయాలి.. అందుకే సాంగ్ చేసి చూపించాను అన్నారు సమంత(Samantha). నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు దాక్కోవాలి.. నేనెందుకు శిక్ష అనుభవించాలి అంటూ.. తనను విమర్షించిన వారికి ఘాటు కామెంట్స్ రూపంలో సమాధానం చెప్పింది సమంత.