సాధారణ ప్రజలకు అందరికి అందుబాటులో సౌకర్యవంతంగా పూర్తి భద్రతను అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ శాఖ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో అందరిని ఆకట్టుకుంటుంది . పోస్ట్ ఆఫీస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల ద్వారా ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు . వీటికి పూర్తి స్థాయి భద్రత కూడా ఉంటుంది . ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది . అదే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం .. ఈ స్కీంలో […]

సాధారణ ప్రజలకు అందరికి అందుబాటులో సౌకర్యవంతంగా పూర్తి భద్రతను అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ శాఖ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో అందరిని ఆకట్టుకుంటుంది . పోస్ట్ ఆఫీస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల ద్వారా ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు . వీటికి పూర్తి స్థాయి భద్రత కూడా ఉంటుంది .

ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది . అదే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం .. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే 50 లక్షల వరకు భీమా కవరేజ్ తో పాటు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు . ఇది కొత్తగా రూపుదిద్దుకుంది కాదు. బ్రిటిష్ పాలనా కాలం లో ప్రారంభమైనప్రభుత్వ పథకం ఇది . 1884లో మొదలుపెట్టడం జరిగింది.

ఈ జీవిత భీమా పథకంలో పెట్టుబడి పెట్టడానికి 2 విధానాలు అమల్లో ఉన్నాయి . అవి PLI &RPLI . PLI పథకం లో 6 పాలసీ లు అమలు చేయబడతాయి . వాటిలో ఒకటి WHOLE LIFE INSURENCE POLICY కింద కనీస హామీ 20,000/- అత్యధికం గా 50 లక్షలు . 80 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు తీసుకున్న ఈ ఇన్సూరెన్సు కి సంబంధించి మొత్తం అమౌంట్ పొందే వీలు ఉంటుంది . ఒక వేళ పాలసీ తీసుకున్న మనిషి అకాలమరణం చెందితే నామినీకి పూర్తి మొత్తం అందుతుంది .

ఈ పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీంలో ఋణం పొందే అవకాశాన్ని కూడా అందిస్తున్నారు . భీమా తీసుకున్న 4 ఏళ్ళ తరువాత ఋణం తీసుకొనే అవకాశం ఉంది. ఎక్కువకాలం పాలసీని కొనసాగించలేనివాళ్ళు 3 ఏళ్ళ తరవాత సరెండర్ చేయవచ్చు . 5 ఏళ్ళ కన్నా తక్కువ సమయంలో సరెండర్ చేస్తే బోనోస్ లభించే అవకాశం కోల్పోతారు .

19 ఏళ్ళ కనీస వయస్సు నుండి 55 ఏళ్ళ గరిష్ట వయస్సు గల వారు ఎవరైనా ఈ స్కీం కి అర్హులు పోస్ట్ ఆఫీస్ అధికారిక WEBSITE: https ://pli .indiapost .gov.in కి వెళ్లి ఆన్లైన్ ద్వారా కూడా పాలసీ ని పొందవచ్చు . టాక్స్,ప్రీమియం చెల్లింపు ,రశీదు ,ఇవన్నీ కూడా డిజిటల్ ఫార్మ్స్‏లో ఉంటాయి . ప్రస్తుత్తం ఈ పాలసీని ప్రభుత్వ ,ప్రభుత్వ రంగాల ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్నా.. త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకు రావటం జరుగుతుంది.

Updated On 28 Feb 2023 2:33 AM GMT
Ehatv

Ehatv

Next Story