✕
#Oscars 2023 : చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ‘నాటు నాటు’ సాంగ్‌ను ముద్దాడిన ఆస్కార్
By EhatvPublished on 13 March 2023 2:18 AM GMT
తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. లాస్ ఏంజెల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అవార్డు వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ఆస్కార్ గెలుచుకుంది. అయితే ఈ అవార్డ్‌ను ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌కు ఆస్కార్‌ను అవార్డులు అందించారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ సాంగ్‌ను ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.

x
Oscar 2023
-
- తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. లాస్ ఏంజెల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అవార్డు వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ఆస్కార్ గెలుచుకుంది. అయితే ఈ అవార్డ్‌ను ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌కు ఆస్కార్‌ను అవార్డులు అందించారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ సాంగ్‌ను ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.
-
- అయితే అంతకుముందే అంటే జనవరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న ‘నాటు నాటు’ సాంగ్ గ్లోబల్ డామినేషన్ ఎట్టకేలకు పూర్తయింది. ఆస్కార్ ఈవెంట్లో ఈ సాంగ్‌ను సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఇక ఈ ఈవెంట్లో పెర్సిస్ కంబట్టా, ప్రియాంక చోప్రా తర్వాత థర్డ్ ఇండియన్ ప్రెజెంటర్‌గా దీపికా పదుకొనే అటెండ్ అయింది.
-
- అయితే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, పాటల రచయిత గుల్జార్, సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి, బెంగాలీ డైరెక్టర్ సత్యజిత్ రేకు ఈవార్డులు దక్కాయి. ఇప్పుడు తెలుగు సినిమా సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. ఎన్నో దశాబ్ధాల నుంచి నేషనల్ అవార్డుల్లో వివక్షకు గురవుతూ వస్తున్న తెలుగు సినిమా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజీపై తల ఎత్తుకుంది.
-
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’కు ఆస్కార్ అవార్డు దక్కింది. ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ కూడా నామినేట్ అయింది. వరల్డ్ వైడ్ గా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. చివరి జాబితాలో ఐదు సాంగ్స్ ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ‘నాటు నాటు’తోపాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సాంగ్స్ ఆస్కార్‌కు పోటీ పడగా ‘నాటునాటు’ సాంగ్‌కు ఆస్కార్ వరించింది.
-
- ఇక ఐదు హాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరిలో ఆస్కార్లు వరించాయి. రూత్ కార్టెర్ ( బ్లాక్ పాంథర్: వకాండ ఫరేవర్), మేరి జోప్రెస్ (బేబీలోన్), క్యాథరిన్ మార్టిన్ (ఎల్విస్), శిర్లే కురాట (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), జెన్నీ బీవన్ (మిస్టర్స్ హ్యారిస్ గోస్ టూ ప్యారిస్) చిత్రాలకు ఆస్కార్ అందాయి.
-
- ఇక డైరెక్షన్ కేటగిరిలో మరో ఐదు చిత్రాలకు ఆస్కార్లు అందాయి. డ్యానియల్ క్వాన్ అండ్ డ్యానియల్ చీనెర్ట్ ( (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), మార్టిన్ మెక్ డొనాగ్ (ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరిన్), స్టీవెన్ స్పిల్‌బెర్గ్ ( ది ఫ్యాబెల్ మ్యాన్స్), టోడ్ ఫీల్డ్ ( తార్), రుబెన్ ఒస్ట్లండ్ ( ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్) చిత్రాలకు ఆస్కార్ లభించింది.
-
- డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఐదు చిత్రాలకు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. కార్టికి గోన్సల్వెస్ అండ్ గునీత్మోంగ ( ది ఎలిఫెంట్ విస్ఫరెర్స్ ) ఈవ్జెనియా ఆర్బుగాయ్వా, అండ్ మాక్సిమ్ ఆర్బుగాయ్వ్ ( హౌలోవ్ట్), జై రోసెబ్లాట్ ( హౌ డూ యూ మేజ్యూర్ ఏ ఇయర్ ?) ఆనీ ఆల్వెర్గ్యూ బెత్ లెవిసన్ ( ది మార్తా మిచెల్ ఎఫెక్ట్), జోషువా షెఫ్టెల్ అండ్ కోనల్ జాన్స్ ( స్ట్రేంజర్ ఎట్ ది గేట్)
-
- బెస్ట్ పిక్చర్స్ విభాగంలో 10 సినిమాలకు ఆస్కార్ అవార్డులు అందాయి. ఇక ప్రొడక్షన్ డిజైన్ నుంచి ఐదు ఆవార్స్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఐదు చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్‌లో మరో ఐదు చిత్రాలకు ఈ అవార్డులు లభించాయి. సౌండ్ కేటగిరిలో టాప్ గన్: మావెరిక్ తోపాటు మరో నాలుగు చిత్రాలకు ఈ అవార్డులు వరించాయి. విజువల్ ఎఫెక్ట్స్‌లో అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తోపాటు మరో నాలుగు చిత్రాలకు అవార్డులు అందాయి.

Ehatv
Next Story