Nithyananda's United States of Kailasa : అమెరికాతో ఆటలాడుకున్న నిత్యానందస్వామి..ఏం చేశాడో తెలుసా.!
నిత్యానందస్వాముల వారు ఎవరినైనా బురిడి కొట్టించగలడు. ఇలాంటి టక్కు టమార విద్యల్లో ఆయన ఆరి తేరారు. స్వయంప్రకటిత దేవుడైన నిత్యానంద స్వామి అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్ది కాలం కిందట భారత్ నుంచి పారిపోయిన వైనం, అటు పిమ్మట ఓ ద్వీపకల్పాన్ని కొనేసిన విషయం తెలిసినవే!
నిత్యానందస్వాముల వారు ఎవరినైనా బురిడి కొట్టించగలడు. ఇలాంటి టక్కు టమార విద్యల్లో ఆయన ఆరి తేరారు. స్వయంప్రకటిత దేవుడైన నిత్యానంద స్వామి అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్ది కాలం కిందట భారత్ నుంచి పారిపోయిన వైనం, అటు పిమ్మట ఓ ద్వీపకల్పాన్ని కొనేసిన విషయం తెలిసినవే! డబ్బిచ్చి కొనుక్కున్న ఆ ఐలాండ్‌కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టుకున్నాడు. ఇది తన దేశమని, ఇక్కడకు వచ్చేవాళ్లు స్వర్గసుఖాలను అనుభవించవచ్చని ప్రకటనలు ఇచ్చాడు. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా! వీరి ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అనుమానపడ్డారు. నిత్యానందస్వామి లాంటి వ్యక్తి ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితిలో ఎలా ప్రవేశం లభించింది? ఇలాంటి సందేహాలు చాలా మందికి వచ్చాయి. నిత్యానంద స్వామి ప్రచార బృందం చేసిన గిమ్మిక్కు అని తర్వాత తేలిందనుకోండి.. అది వేరే విషయం.. అమెరికా కూడా నిత్యానందస్వామిని గుడ్డిగా నమ్మేసింది. సిస్టర్ సిటీ పేరుతో కైలాసదేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుకుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా చేశారు. దీంతోపాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడాలతో పాటు అమెరికాలోని 30 నగరాలు కైలాసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చున్నట్లు ఆ దేశం తెలిపింది. కైలాస అనే దేశం ఉందా లేదా అన్న విషయం తెలుసుకోకుండానే గుడ్డిగా సంతకాలు పెట్టేంది నెవార్క్ నగరం.
అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది. ఆ తర్వాత అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్న అమెరికా బిత్తరపోయింది. వెంటనే నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది.