సచివాలయ సమన్వయకర్తలు, గృహసారథులు సమిష్టిగా చిత్తశుద్దితో పనిచేస్తే అధికారం మళ్లీ మనదేనని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, న్యాయం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో ముప్పాళ్ళ మండల సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు, పార్టీ పరిపుష్టికి గృహసారధులు, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రూపొందించారన్నారు. కన్వీనర్లు వాలంటీర్లపై […]

సచివాలయ సమన్వయకర్తలు, గృహసారథులు సమిష్టిగా చిత్తశుద్దితో పనిచేస్తే అధికారం మళ్లీ మనదేనని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, న్యాయం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో ముప్పాళ్ళ మండల సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు, పార్టీ పరిపుష్టికి గృహసారధులు, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రూపొందించారన్నారు. కన్వీనర్లు వాలంటీర్లపై పెత్తనం చేయకుండా గృహ సారధులతో కలిపి పార్టీని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయికి అందేలా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల పట్ల అత్యధిక మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. జగనన్న సచివాలయాల మండల ఇన్చార్జులు, సచివాలయాల కన్వీనర్లు ఈ వ్యవస్థలో కీలకమన్నారు.

ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమం అందిస్తుందని, నియోజకవర్గంలోనూ మీరు గర్వంగా చెప్పుకునేలా పరిపాలన అందిస్తున్నామన్నారు. గత పాలకుల్లాగా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం లేదని ఇలాంటి వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలో ముఖ్యంగా జనసేన నాయకులు ప్రతిరోజు నన్ను ఏదో విధంగా తిడుతూనే ఉంటారని ..వాళ్ల తిట్లు, ఆరోపణలే నాకు ఆశీర్వచనాలన్నారు. నియోజకవర్గంలో తెలిసి తప్పు చేయనని స్పష్టం చేశారు .వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈగ వాలిన మొట్టమొదటిగా స్పందించేది అంబటి రాంబాబు అని అందుకే నన్ను రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా చేసుకొని దురుద్దేశం పూరితంగా వ్యవహరిస్తాయని వివరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్తెనపల్లి నియోజకవర్గ పరిశీలకులు వెన్న హనుమాన్ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల నాయకులు ఎం జె ఆర్ లింగారెడ్డి, సిరిగిరి గోపాలరావు, నక్క శ్రీనివాసరావు జే సి ఎస్ మండల ఇన్చార్జి రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

Updated On 9 Feb 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story