కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలి.. అప్పుడే ప్రజలకు మంచి- చెడుల మధ్య తేడా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్‌ పార్టీ నుండి బయటకు వచ్చేస్తారని.. సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు (కేటీఆర్) చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదని బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) అన్నారు. సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడలేదని అన్నారు.

కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలి.. అప్పుడే ప్రజలకు మంచి- చెడుల మధ్య తేడా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం లేదు. త్వరలో బీజేపీలోకి ఎవరు జంప్ చేస్తారో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి కూడా బీజేపీలోకి దూకవచ్చన్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరులో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆకాంక్షలను వినిపించేందుకు BRS నాయకులను పార్లమెంటుకు పంపించాలని BRS చీఫ్ కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని కేసీఆర్ అన్నారు. మనం ఉన్నప్పుడు రైతులు ధీమాగా ఉండేవారని.. రైతుల ఖాతాల్లో రైతుబంధులు పడేవని, ఇరవై నాలుగు గంటలు నీళ్ళిచ్చామన్నారు. నేను కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఈరోజు ఆగం అవుతున్నారన్నారు.

Updated On 16 April 2024 9:27 PM GMT
Yagnik

Yagnik

Next Story