Dil Raju Shaakuntalam Movie : శాకుంతలం చిత్రానికి దిల్‌రాజే అల్లు ఆర్జున్..
శాకుంతలం చిత్రం(Shaakuntalam Movie) ఏప్రిల్ 14న విడుదలవుతున్న నేపధ్యంలో చిత్రయూనిట్ విరివిగా పబ్లిసిటీ కేంపైన్‌ని నిర్వహించంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఎట్ ఎ టైం త్రీడిలో రిలీజవుతున్న సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్, సహ నిర్మాత దిల్‌రాజు, టైటిల్ రోల్ పోషించిన సమంత తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. మీట్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ రుద్రమదేవి చిత్రానికి కమర్షియల్ వేల్యూని ఆపాదించడానికి గోన గన్నారెడ్డి పాత్ర కోసం ఐకాన్ స్టార్ అల్లు ఆర్జున్‌ని ఎంపిక చేసుకున్నారు
శాకుంతలం చిత్రం(Shaakuntalam Movie) ఏప్రిల్ 14న విడుదలవుతున్న నేపధ్యంలో చిత్రయూనిట్ విరివిగా పబ్లిసిటీ కేంపైన్‌ని నిర్వహించంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఎట్ ఎ టైం త్రీడిలో రిలీజవుతున్న సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్, సహ నిర్మాత దిల్‌రాజు, టైటిల్ రోల్ పోషించిన సమంత తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. మీట్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ రుద్రమదేవి చిత్రానికి కమర్షియల్ వేల్యూని ఆపాదించడానికి గోన గన్నారెడ్డి పాత్ర కోసం ఐకాన్ స్టార్ అల్లు ఆర్జున్‌ని ఎంపిక చేసుకున్నారు కదా, మరి శాకుంతలం చిత్రానికి అటువంటి కమర్షియల్ వేల్యూని అద్దడానికి ఎవరిని ఎంచుకున్నారని ప్రశ్నించాడు.
అందుకు గుణశేఖర్ సమాధానం చెబుతూ ఈచిత్రానికి అవసరమైన హంగులు, అవసరమైన రేంజ్‌లో కమర్షియల్ వేల్యూస్ తీసుకొచ్చే పనిలో భాగంగానే దిల్‌రాజుగారి భాగస్వామ్యం బాగా హెల్స్ అయిందని చెబుతున్నప్పుడు మరో జర్నలిస్ట్ ‘’ శాకుంతలం చిత్రానికి దిల్‌రాజు(Dil Raju)గారే అల్లు అర్జున్(Allu Arjun)’’అనడం జరిగింది. అందుకు గుణశేఖర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కరెక్టుగా చెప్పారని రియాక్ట్ అయ్యారు. శాకుంతలం చిత్రానికి దిల్‌రాజే అల్లు అర్జున్ పాత్రను ఒక గోల్డెన్ హ్యాండ్ నిర్మాతగా పోషించడమన్నఅంశాన్ని గుణశేఖర్ మీడియా సాక్షిగా అంగీకరించారు. నిజానికి ఈ రోజున గుణశేఖర్ చేస్తున్న ఈ కళాఖండానికి దిల్‌రాజు భాగస్వామ్యమన్నది తిరుగులేని ప్రాణం పోసిందన్నది ట్రేడ్ అంతా నమ్ముతున్న నగ్నసత్యం.
అయితే దిల్‌రాజు మాత్రం ఎంతో నిరాడంబరంగా చెప్పిన మాట అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇలాంటి చిత్ర నిర్మాణాల ద్వారా తాను ఎంతో కొంత నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతోనే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నానని అంటూ తన మానసిక ఔన్నత్యాన్ని చాటి చెప్పుకోవడం ఆయనకే కాదు, గుణశేఖర్‌కీ, శాకుంతలం చిత్రానికి కూడా ఏకకాలంలో గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. గత 20 ఏళ్లలో ఎన్నో సినిమాలు తీసి, ఎన్నో విజయాలను కైవసం చేసుకున్న దిల్‌రాజు ఇప్పుడు శాకుంతం లాంటి హైలీ టెక్నికల్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మెలకులను నేర్చుకోవడం భవిష్యత్తులో తాను తీయబోయే పాన్ ఇండియా సినిమాలకు ఎంతగానో ఉపయోగపడతాయని దిల్‌రాజు చెప్పకనే చెప్పారు. " Written By Nagendra Kumar"