✕
Janhvi Kapoor : తెలుగులో జాన్వీ కపూర్ మరిన్ని సినిమాలు.. జాన్వీ కావాలంటున్న ఆస్టార్ హీరోలు ఎవరంటే..?
By EhatvPublished on 11 May 2023 11:56 PM GMT
జాన్వీనే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. మరిన్ని తెలుగు సినిమాల్లో బాలీవుడ్ బ్యూటీ..
జన్వీ కపూర్.. ఇన్నాళ్లకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. టాలీవుడ్ నుంచి పాన్ఇండియా హీరోయిన్ గా వెలుగు వెలగాలని ప్లాన్ చేసినట్టుంది.

x
Janhvi Kapoor
-
- జాన్వీనే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. మరిన్ని తెలుగు సినిమాల్లో బాలీవుడ్ బ్యూటీ.. జన్వీ కపూర్.. ఇన్నాళ్లకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. టాలీవుడ్ నుంచి పాన్ఇండియా హీరోయిన్ గా వెలుగు వెలగాలని ప్లాన్ చేసినట్టుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా.. కొరటాల ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూట్ లో కూడా పాల్గొన్నది. జాన్వీ.
-
- జాన్వీ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో.. వార్తలు వస్తున్నా.. అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇన్నాళ్లకు పుకార్లు కాస్తా.. నిజాలుగా మారి షికార్లు చేస్తున్నాయి. ఈక్రమంలో ఎన్టీఆర్ 30 తో పాటు జాన్వీని ఎగరేసుకుపోవడానకి చాలా మంది హీరోలు ప్రమత్నిస్తున్నారట. అందులో కొంత మందికి గ్రీన్ సీగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
-
- జాన్వీ కపూర్ ను తన నెక్ట్స్ సినిమాల్ ఫిక్స్ చేసుకున్నాడట అక్కినేని అఖిల్. ఏజెంట్ తర్వాత అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సాహో’కు వర్క్ చేసిన వ్యక్తే,,, ఈసినిమాను డైరెక్ట్ చేయయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా కోసం.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె నో అంటే పూజాను తీసుకోబోతున్నట్టు సమాచారం.
-
- మరోవైపు బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16లోనూ జాన్వీ హీరోయిన్ అంటున్నారు.వీళ్లే కాదు నెక్ట్స్ మరికొన్ని ప్రాజెక్ట్ ల కోసం జాన్వీని అడుగుతున్నారట. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలో కూడా జాన్వీ ఉంటే బాగుంటుందని ప్యాన్స్ అడుగుతుండగా.. పుష్ప తరువాత బన్నీ చేయబోయే సినిమా కోసం జాన్వీ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట టీమ్.
-
- ఇక టాలీవుడ్ స్టార్స్ అంతా జాన్వీ కోసం తారాడుతుండటంతో.. బాలీవుడ్ మాత్రం చిత్రంగా చూస్తోంది. బాలీవుడ్ లో దాదాపు అన్నీ ఆర్ట్ పిక్చర్స్ మాత్రమే చేసింది జాన్వీ. ఎక్కువగా కమర్షియల్స్ చేయలేదు. దాంతో.. సౌత్ గాలి సోకగానే.. కమర్షియల్ సినిమాల రూట్ తీసుకుందంటూ కామెంట్ చేస్తున్నారు. మరి సౌత్ లో జాన్వీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Ehatv
Next Story