✕
Jabardasth Anchor Soumya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యారావు గురించి మీకు తెలియని విషయాలు.!
By EhatvPublished on 7 Feb 2023 1:52 AM GMT

x
Jabardasth New Anchor Soumya Rao biography
-
- ప్రస్తుతం జబర్దస్త్ లో యాంకర్ సౌమ్యారావు పంచుల వర్షం కురిపిస్తోంది. హైపర్ ఆది, రాంప్రసాద్ ల పంచులకు ఏ మాత్రం తగ్గకుండా.. రిటన్ కౌంటర్లతో అందరిచేత నవ్వులు పూయిస్తుంది. కర్నాటకు చెందిన ఈ అమ్మాయిని ఆ షోకి హోస్ట్ గా నియమించింది మల్లెమాల సంస్థ.
-
- అయితే ఈ అమ్మడు కన్నడ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించింది. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో కన్నడ, తమిళ సీరియల్స్ లోనూ యాక్ట్ చేసింది. జీ కన్నడ టీవీలో ‘పట్టేదారి ప్రతిభ’ అనే సీరియల్ తో తొలిసారిగా బుల్లితెర మీద సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
-
- ఆ సీరియల్ బాగా సక్సెస్ అవడంతో ఆమెకు భారీగా ఆఫర్లు వచ్చాయి. సన్ టీవీలో టెలికాస్ట్ అయిన ‘రోజా’ సీరియల్ లో సాక్షి క్యారెక్టర్ తో తమిళుల మనసు కొట్టేసింది సౌమ్యరావు. అంతేకాదు తన అందంతోనూ కుర్రకారును ఆకట్టుకుంది.
-
- 1992 సెప్టెంబర్ 29న పుట్టిన ఈ అమ్మాయి తాజాగా తెలుగు సీరియల్స్ లోకి కూడా అడుగు పెట్టింది. రీసెంట్ గా టెలికాస్ట్ అవుతున్న శ్రీమంతుడు సీరియల్ లో నెగెటివ్ రోల్ తో జనాలను ఆకట్టుకుంటుంది.
-
- అంతేకాదు తమిళ సీరియల్ ’నెంజాం మరప్పతల్లై‘లో విలన్ రోల్ లోనూ మెప్పించి ఆడియన్స్ మనసు గెలుచుకుంది ఈ కన్నడ భామ.

Ehatv
Next Story