సమ్మర్(Summer) చంపేస్తోంది.. ఇంత వేడిలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం.. మరీ ముఖ్యంగా వేసవి కాలం ఎండ వేడిమికి మన ఆరోగ్యం, చర్మం(Skin) దెబ్బతింటాయి. ఎండ, దుమ్ము, ధూళి మన చర్మాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. దీంతో చర్మం పొడిబారడంతోపాటు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానికి సంబంధించిన అనేక సమస్యలు గట్టిగా ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఈ వేసవిలో మీ చర్మం మెరిసిపోయి అందంగా ఉండాలంటే నోటికి రుచిగా ఉండే చాక్లెట్ ను ఫేస్(choclate face Pack) కు అప్లై చేయడండి.. కాకపోతే.. ఈ షుగర్ ఉన్న చాక్లెట్ కాకుండా.. డార్క్ చాక్లెట్(Dark choclate) తో మీ ముఖాన్ని మెరిపించవచ్చు. డాక్క్ చాక్లెట్ తో పాటు ఇక్కడ ఇచ్చిన కొన్ని పదార్థాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ సహాయంతో మెరిసే చర్మాన్ని పొందండి.

పండిన అరటిపండును(Banana) బాగా మెత్తగా చేసి, దానికి ఒక చెంచా డార్క్ చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత వాటిని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెండు టీస్పూన్ల గ్రౌండ్ డార్క్ చాక్లెట్ పౌడర్ మరియు దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. వీటితో అర టీస్పూన్ తేనె(Honey) కలపాలి. వీటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

రెండు టీస్పూన్ల డార్క్ చాక్లెట్ పౌడర్ మరియు ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేసి అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

డార్క్ చాక్లెట్ పౌడర్ మరియు అలోవెరా జెల్ ను సమాన పరిమాణంలో తీసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. అవి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

Updated On 11 April 2024 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story