How to check PF status Without Internet:మీ PF ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా .?
ప్రైవేటు ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ మినహాయించబడుతుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇంటర్నెట్అవసరం లేకుండా కూడా ఇప్పుడు మీ pf బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు నిజమే ! మీరు ఇంట్లో ఇంటర్నెట్ లేకుండానే మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. దీనికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. ఇంటర్నెట్ లేకుండా కూడా మీ PF మొత్తాన్ని ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం .

మిస్డ్ కాల్ ద్వారా
ఇంటర్నెట్ లేనట్లయితే, మీరు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ PF బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం. దీని కోసం మీరు UAN ఇంకా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు డయల్ చేయాలి. రెండు రింగ్‌ల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది . దీని తర్వాత, మీరు SMS ద్వారా మీ PF ఖాతా బ్యాలెన్స్ యొక్క పూర్తి వివరాలను పొందుతారు.
sms ద్వారా pf బ్యాలెన్స్ చెక్ చేయండి
మీరు ఇంటర్నెట్ లేకుండా SMS ద్వారా మీ pf బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు. pf బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ఇది సులభమైన మార్గం. దీని కోసం మీకు UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) తో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. మీరు మీ మొబైల్ ఫోన్ తో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి SMS పంపాలి.
ఇందులో మీరు EPFOHO UAN ENG అని టైప్ చేయాలి. ENG ఒక కోడ్ భాష . మీరు దీన్ని మీ ప్రాధాన్య భాష కోడ్‌తో భర్తీ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు హిందీ కోసం HIN లేదా తెలుగు కోసం TEL అని టైప్ చేయాలి. మీరు ఈ SMSని 7738299899 నంబర్‌కు పంపాలి. దీని తర్వాత, మీరు పూర్తి వివరాలతో మీ PF మొత్తం గురించి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు .