Genelia Deshmukh : పిల్లలతో కలిసి సినిమాలు చూడలేము.. హీరోయిన్ జెనిలీయా కామెంట్స్..
బొమ్మరిల్లు(Bommarillu) సినిమాతో హాసినీగా అలరించిన ముద్దుగుమ్మ జెనిలీయా.. ఫ్యాషన్ ను బాగాఫాలో అయిన ఈబ్యూటీ.. ఎప్పుడూ వల్గర్ గా మాత్రం కనిపించలేదు. రామ్(Ram) తో రెఢీ(Ready) సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిన్నది..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. సినిమాలు కాని వెబ్ సిరీస్ లు కాని.. పిల్లలతో కలిసి.. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా లేవు అంటోంది స్టార్ హీరోయిన్ జెనీలియా(Genelia)..
బొమ్మరిల్లు(Bommarillu) సినిమాతో హాసినీగా అలరించిన ముద్దుగుమ్మ జెనిలీయా.. ఫ్యాషన్ ను బాగాఫాలో అయిన ఈబ్యూటీ.. ఎప్పుడూ వల్గర్ గా మాత్రం కనిపించలేదు. రామ్(Ram) తో రెఢీ(Ready) సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిన్నది.. ఆతరువాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను(Ritesh Deshmukh) పెళ్ళాడి ఫ్యామిలీకి పరిమితం అయ్యింది. ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలు పెట్టింది. ఇక ఈమధ్యే జెనిలీయా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వెబ్ సిరీస్(Webseries)ల ద్వారా మరోసారి ఆడియన్స్ ను అలరించబోతోంది.
ప్రస్తుత కాలంలో ఓటీటీలో వస్తున్న సినిమాలు కానీ వెబ్ సిరీస్ లో కానీ పిల్లలతో కలిసి చూసే విధంగా లేవని అంటుంది హీరోయిన్ జెనిలీయా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేవిధంగా కంటెంట్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే ట్రయల్ పీరియడ్(Trial period) వెబ్ సిరీస్ తో రాబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారుజెనిలీయా.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు వెబ్ సిరీస్ ల ద్వారా రీ ఎంట్రీలు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జెనీలియా కూడా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్ జులై 21 నుంచి ఓటీటీ జియో సినిమా వేదికగా స్ర్టీమింగ్ కానుంది.ఈ సందర్భంగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. సాధారణంగా నేను ఏదైనా ఒక సినిమాకు కమిట్ అవ్వాలంటే కథ చదవటానికి చాలా సమయం తీసుకుంటాను కానీ ఈ వెబ్ సిరీస్ కేవలం గంటలోనే చదివేసి ఓకే చెప్పానని తెలిపారు.