ఉత్తర్​ప్రదేశ్​.. అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గ్రౌండ్​ ఫ్లోర్​ నిర్మాణం పూర్తవ్వగా మొదటి అంతస్తు పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠాపన జరగనుండగా.. అప్పుడే భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుందని ఇదివరకే ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే అంతకన్నా ముందే దీపావళి పర్వదినాన సరయూ నదిపై వాటర్​ క్రూయిజ్ షిప్​ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.దీపావళి నాడే ప్రారంభం..

దీపావళి రోజు అయోధ్యలో(ayodhya) సరయూ(Sarayu River) నదిపై డబుల్​ డెక్కర్​ వాటర్​ క్రూయిజ్​ షిప్(Double decker water cruise ship)​ సేవలు ప్రారంభం కానున్నాయి. సరయూ నదీ విహరాన్ని పర్యటకులు ఆస్వాదించేందుకు ఆ క్రూయిజ్​ షిప్​లో ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్​ప్రదేశ్(Uttar Pradesh)​ పర్యటక శాఖ. మరి ఆ విలాస నౌక ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

ఉత్తర్​ప్రదేశ్​.. అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గ్రౌండ్​ ఫ్లోర్​ నిర్మాణం పూర్తవ్వగా మొదటి అంతస్తు పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠాపన జరగనుండగా.. అప్పుడే భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుందని ఇదివరకే ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే అంతకన్నా ముందే దీపావళి పర్వదినాన సరయూ నదిపై వాటర్​ క్రూయిజ్ షిప్​ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.దీపావళి నాడే ప్రారంభం..
అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు అక్కడ పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అనేక విధాలుగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే సరయూ నదిపై వాటర్​ క్రూయిజ్​, బోట్​ హౌస్​ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఏటా దీపావళి సందర్భంగా ఘనంగా జరిగే దీపోత్సవ్ సమయంలో తొలి వాటర్​ క్రూయిజ్​ షిప్​ను నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

క్రూయిజ్​ షిప్​ 'కనక్​'!

అయోధ్య వాటర్​ క్రూయిజ్​ షిప్​నకు కనక్​ అని పేరు పెట్టినట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ మెష్రామ్ తెలిపారు. దీపావళి నాడు భక్తులు.. క్రూయిజ్​ సౌకర్యాన్ని ఆస్వాదించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. అయోధ్యకు విచ్చేసే పర్యటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. సరయూ నదిపై కనక్​ క్రూయిజ్​తో పాటు మరిన్నిక్రూయిజ్​లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటర్ క్రూయిజ్ నిర్వహిస్తున్న ఓ సంస్థతో జరిపిన చర్చలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొన్నారు.

కొత్త టెక్నాలజీ..డబుల్ డెక్కర్​

అయోధ్యలో ప్రారంభించనున్న వాటర్ క్రూయిజ్ షిప్​.. వారణాసి క్రూయిజ్​కు భిన్నంగా ఉంటుందని వివరించారు. కొత్త టెక్నాలజీతో అయోధ్యలో డబుల్ డెక్కర్ వాటర్ క్రూయిజ్ నడుపుతామని​ తెలిపారు. అందుకు గుప్తర్ ఘాట్ వద్ద షెడ్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ వాటర్ క్రూయిజ్ షిప్​ 25 మీటర్ల పొడవు, 8.3 మీటర్ల వెడల్పుతో ఉంటుందని అన్నారు. అది సౌరశక్తితో నడుస్తుందని.. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని వెల్లడించారు.నదీ విహారాన్ని ఆస్వాదించేందుకు..
వాటర్ క్రూయిజ్ మొదటి అంతస్తులో 100 మంది పర్యటకులు.. కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. షిప్​ పైఅంతస్తు పూర్తిగా ఖాళీగా ఉంటుందని.. భక్తులు అక్కడ నిలబడి సరయూ నదీ విహారాన్ని ఆస్వాదించగలరని చెప్పారు. ఈ వాటర్‌ క్రూయిజ్‌లో సెల్ఫీ పాయింట్​తో పాటు డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated On 20 July 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story