Digvijaya Singh : కామరెడ్డి ఫలితం... ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారా?
ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఈవీఎంలపై తెగ చర్చ జరుగుతుంటుంది. గెలిచినవారేమో విపక్షాన్ని ఆడిపోసుకోవడం, ఓటమికి ఈవీఎంలదే బాధ్యత అంటూ విపక్షాలు ఎదురుదాడికి దిగడం కామనయ్యింది. కాకపోతే ఎందుకోకానీ చాలా మందికి ఈవీఎంపై అపనమ్మకం ఉంది. గంటలో ఆధిక్యాలు అటు ఇటూ అవుతుండటంతో అధికార బీజేపీ(BJP) ఏదో చేస్తున్నదనే అనుమానం కలుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్(Madya Pradesh)నే తీసుకోండి..
ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఈవీఎంలపై తెగ చర్చ జరుగుతుంటుంది. గెలిచినవారేమో విపక్షాన్ని ఆడిపోసుకోవడం, ఓటమికి ఈవీఎంలదే బాధ్యత అంటూ విపక్షాలు ఎదురుదాడికి దిగడం కామనయ్యింది. కాకపోతే ఎందుకోకానీ చాలా మందికి ఈవీఎంపై అపనమ్మకం ఉంది. గంటలో ఆధిక్యాలు అటు ఇటూ అవుతుండటంతో అధికార బీజేపీ(BJP) ఏదో చేస్తున్నదనే అనుమానం కలుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్(Madya Pradesh)నే తీసుకోండి.. అక్కడ బీజేపీ గెలవడం అసాధ్యమంటూ దాదాపు అన్ని సర్వేలు చెప్పాయి. కానీ అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ విజయంపై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh)కు కూడా ఇలాంటి సందేహమే వచ్చింది. ఈవీఎంలను హ్యాకింగ్(EVMs Hacking) చేసి బీజేపీ నేతలు విజయం దక్కించుకున్నారనే విమర్శలు కూడా చేశారాయన! ఇందుకు కొన్ని రుజువులు చూపించారు. బీజేపీ నేతలకు రెండు రోజు ముందే రిజల్ట్ తెలిసిపోయిందని ఆరోపించారు. ఏ అభ్యర్థికి ఎన్నిఓట్లు వస్తాయో , ఎం మెజారిటీతో గెలుస్తారో కౌంటింగ్‌కు రెండు రోజుల ముందే బీజేపీ నేతలకు తెలిసిపోయిందని అన్నారు. మన కామారెడ్డి(Kamareddy)ని కూడా ఉదహరించారు దిగ్విజయ్‌సింగ్ . కామారెడ్డిలో ఇలా ఈవీఎంలను హ్యాక్ చేసే బీజేపీ గెలిచిందని చెప్పారు. అటు కేసీఆర్(KCR)ను, ఇటు రేవంత్(Revanth Reddy)ను ఓడించడమంటే మాటలు కాదని, కచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.