ఐటీ కారిడార్‌గా(IT corridor) పేరొందిన హైదరాబాద్‌(Hyderabad) పశ్చిమాన మరిన్ని ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఈ కారిడార్‌లో ఇప్పటికే పలు భవనాలకు అనుమతులిచ్చిన అధికారులు.. మరికొన్ని ఆకాశ హార్మ్యాలకు(Harmya) అనుమతులు ఇచ్చారు. ఇప్పటివరకు 9 ఎత్తైన భవనాల(Building) నిర్మించేందుకు రియల్‌ఎస్టేట్‌ సంస్థలకు అనుమతులను జీహెచ్‌ఎంసీ(GHMC) ఇచ్చింది.

ఐటీ కారిడార్‌గా(IT corridor) పేరొందిన హైదరాబాద్‌(Hyderabad) పశ్చిమాన మరిన్ని ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఈ కారిడార్‌లో ఇప్పటికే పలు భవనాలకు అనుమతులిచ్చిన అధికారులు.. మరికొన్ని ఆకాశ హార్మ్యాలకు(Harmya) అనుమతులు ఇచ్చారు. ఇప్పటివరకు 9 ఎత్తైన భవనాల(Building) నిర్మించేందుకు రియల్‌ఎస్టేట్‌ సంస్థలకు అనుమతులను జీహెచ్‌ఎంసీ(GHMC) ఇచ్చింది. ఇందులో 2023లోనే ఆరింటికి అనుమతులు వచ్చాయి, దీంట్లో నాలుగు 40 అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి. ఈ భవనాలన్నీ 2027-28 వరకు పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) 2007లో ఏర్పడినప్పటి నుంచి 1,248 హై-రైజ్‌ అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇవ్వగా అందులో 2021 -2023 మధ్యకాలంలోనే 634 భవనాలకు అనుమతులు వచ్చాయి. గచ్చిబౌలిలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ 50 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. ఈ ఆకాశ హార్మ్యాలు పశ్చిమ కారిడార్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. రాయదుర్గం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, గోపన్‌పల్లి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో వెలుస్తున్నాయి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)పై పరిమితి లేనందున, చాలా మంది డెవలపర్లు హై-రైజ్‌ అపార్ట్‌మెంట్ల నిర్మించేందుకు అనుమతులు కోరుతున్నారు. హై-రైజ్ క్లస్టర్‌లకు ఐటి బెల్ట్ హబ్‌గా మారడంతో డెవలపర్లు ముందుకువస్తున్నారని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెప్తున్నాయి. ఎఫ్‌ఎస్‌ఐ పరిమితి లేనందున హైదరాబాద్‌లో మరిన్ని ఆకాశ హార్మ్యాలకు నెలవుకానుందని విశ్లేషిస్తున్నారు.

కోవిడ్-19(Covid 19) తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున భవనాలు వస్తున్నాయని.. భూమి విలువ కూడా పెరగడంతో తక్కువ స్థలంలోనే డెవలపర్లు భారీ భవనాలు నిర్మించేందుకు ముందుకు సవస్తున్నారని క్రెడాయ్‌ పేర్కొంది. ఎత్తైన భవనాల్లో ఉండేందుకు తొలుత కొనుగోలుదారులు కొంత ఆందోళన చెందినా.. ఇప్పుడు వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారని క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి(Credai President Rajasekhar Reddy) తెలిపారు.

అయితే, రియల్ ఎస్టేట్ రంగంలోని మరో వర్గం ఈ ఆకాశ హర్మ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక ఎత్తైన భవనాలు, వేలల్లో అపార్ట్‌మెంట్లు ఉన్నందున మౌలిక సదుపాయల కల్పనకు మున్ముందు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. తాగు నీరు, చెత్త సేకరించడం, ట్రాఫిక్‌ వంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. సరైన ప్రణాళికతో ముందుకెళ్లకపోతే మౌలిక సదుపాయాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Updated On 13 Jan 2024 5:56 AM GMT
Ehatv

Ehatv

Next Story