Bollywood Actress Vimi : ఇది గుండెలను పిండేసే విషాదగాధ, ఆఖరి రోజుల్లో ఆ హీరోయిన్‌ది దుర్భర పరిస్థితి..!
పంజాబ్‌కు(Punjab) చెందిన విమి ముంబాయిలోని సోఫియా కాలేజీలో(Sophia College) సైకాలజీ(Psychology) చదివారు. ఉన్నత విద్య, సౌందర్యం ఈ రెండూ ఆమెలో ఉండటంతో చాలా మంది పెళ్లి చేసుకోవడానికి క్యూలు కట్టారు. ఆమె మాత్రం మల్టీ మిలియనీర్ అమీర్‌చంద్ ప్యారేలాల్(Ameerchand Parelal) కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త శివ అగర్వాల్‌ను(Shiva Aggarawal) పరిణయమాడింది.
సినిమా(Movies) ఓ భయంకరమైన ఊబిలాంటిది. అందులో దిగితే మళ్లీ బయటపడటం బహుకష్టం. ఆ రంగుల ప్రపంచంలో మెరుస్తున్నట్టు కనిపించే చాలా మంది జీవితాలలో చీకటి తెరలు ఉంటాయి. కెరీర్ సజావుగా సాగుతున్నంత కాలం బాగానే ఉంటుంది. ఫెయిల్యూర్స్ మొదలైన తర్వాత ఇక ఎవరూ పట్టించుకోరు. కనీసం బాగున్నారా అని కూడా పలకరించరు. సినిమాల్లో రాజభోగాలను అనుభవించి, చరమాంకంలో దయనీయపరిస్థితుల మధ్య ప్రాణాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ విమీ(Vimi) కూడా ఒకరు. ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఆమె దాన్ని నిలుపుకోలేకపోయింది. ఫలితంగా సంపద హరించుకుపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దానికి తోడు భయంకరమైన వ్యాధులు ఆమెను బతకనివ్వలేదు. ఫలితంగా చిన్న వయసులోనే కన్నుమూసింది.
పంజాబ్‌కు(Punjab) చెందిన విమి ముంబాయిలోని సోఫియా కాలేజీలో(Sophia College) సైకాలజీ(Psychology) చదివారు. ఉన్నత విద్య, సౌందర్యం ఈ రెండూ ఆమెలో ఉండటంతో చాలా మంది పెళ్లి చేసుకోవడానికి క్యూలు కట్టారు. ఆమె మాత్రం మల్టీ మిలియనీర్ అమీర్‌చంద్ ప్యారేలాల్(Ameerchand Parelal) కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త శివ అగర్వాల్‌ను(Shiva Aggarawal) పరిణయమాడింది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. అప్పుడు భర్త ప్రోత్సాహంతో సినిమాల్లో అడుగుపెట్టింది. ఆమె అందానికి బాలీవుడ్ అబ్బురపడింది. ఆమె నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు. ఆరంభంలోనే అబ్రూ, హమ్‌రాజ్ సినిమాలు ఆమెను శిఖరాగ్రానికి చేర్చాయి. ఆమె నటించిన నానక్ నమ్ జహజ్ హై అనే పంజాబ్ సినిమాకు నేషనల్ అవార్డు లభించింది.
చేసింది పది సినిమాలే అయినా వంద సినిమాల ఖ్యాతిని గడించింది. సునీల్‌దత్, శశికపూర్, రాజ్‌కుమార్ వంటి అగ్రనటుల సరసన నటించింది. అప్పట్లోనే సినిమాకు మూడు లక్షల రూపాయలు తీసుకునేది. అప్పుడే టెక్స్‌టైల్స్(Textile) వ్యాపారంలో దిగింది. కొంతకాలం ఆనందంగా గడిచింది. కొద్ది రోజుల తర్వాత భర్త శివ్ అగర్వాల్‌తో గొడవలు మొదలయ్యాయి. అనుమానంతో విమీని బాగా కొట్టేవాడు. భర్త వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఒంటరిగా బతకడం మొదలు పెట్టింది.
ఆ తర్వాత నిర్మాత, నటుడు జాలీ(Jolly) ప్రేమలో పడింది. అతడితో సహజీవనం చేసింది. ఇదేదీ ఆమెకు సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేదు. పిల్లలు పదే పదే గుర్తుకొచ్చేవారు. భర్త, పిల్లలతో గడిపిన రోజులను గుర్తు తెచ్చుకుని కుమిలిపోయేది. ఈ బాధల నుంచి ఉపశమనం మద్యమేనని భావించింది. తాగుడుకు అలవాటు పడింది. శశికపూర్‌తో నటించిన పతంగ సినిమా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాతి సినిమాలన్నీ అంతే..! దాంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ఆర్ధికంగా చితికిపోయింది. అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చడానికి విమీ టెక్స్‌టైల్స్‌ను అమ్మేసింది. ఆమె దగ్గర సొమ్ములు లేకపోవడంతో జాలీ ఆమెను వ్యభిచారంలోకి దింపాడు.
చివరి రోజుల్లో ఆమె అదే వృత్తిలో ఉండింది. ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా వెలిగిన విమీ చివరకు కఠిన పేదరికంలో మూడు పదుల వయసులోనే చనిపోయింది. ఆమె చివరి రోజుల్లో కుటుంబసభ్యులు కూడా ఆమె దగ్గరకు రాలేదు. ఆమెకు సోకిన కాలేయ కేన్సర్(Liver cancer) ఆమెను బతనీయకుండా చేసింది. ముంబాయి నానావతి ఆసుపత్రిలని జనరల్ వార్డులో చేరింది. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని భుజాన మోసేందుకు ఒక్కరు కూడా లేరు. ఆసుపత్రిలో పని చేసే ఒకతను ఆమె శవాన్ని ఒక తోపుడు బండిపై శ్మశానానికి తీసుకెళ్లాడు. అలా ఒక అనాథగా విమీ జీవితం ముగిసింది. ఆమె చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఆమె నటించిన చివరి చిత్రం క్రోధి విడుదలయ్యింది.