Ariana Glory : షూటింగ్స్ మానేసి బాగా తిని పడుకుంటున్నావా? ... ఆరియానను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు
యాంకర్‌గా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న అరియానా గ్లోరీ(Ariyana Glory) బిగ్‌బాస్‌లో(Bigg Boss) ఎంటరయ్యాక బాగా పాపులరయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అరియానా తరచూ తన ఫోటోలను షేర్ చూస్తూ ఉంటారు. తనకు తాను ప్రమోట్ చేసుకుంటుంటారు. ఇలా ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటుంటారు. రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇంటర్వ్యూతో ఎక్కడికో వెళ్లిపోయిన అరియానా తర్వాత బిగ్‌బాస్ రియాలిటి షోతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు.
యాంకర్‌గా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న అరియానా గ్లోరీ(Ariyana Glory) బిగ్‌బాస్‌లో(Bigg Boss) ఎంటరయ్యాక బాగా పాపులరయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అరియానా తరచూ తన ఫోటోలను షేర్ చూస్తూ ఉంటారు. తనకు తాను ప్రమోట్ చేసుకుంటుంటారు. ఇలా ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటుంటారు. రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇంటర్వ్యూతో ఎక్కడికో వెళ్లిపోయిన అరియానా తర్వాత బిగ్‌బాస్ రియాలిటి షోతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. చలాకీనతం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు అరియానా. బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లలో పలు ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు. సెలబ్రిటీల ఇంటర్వ్యూల పేరుతో అరియానా గ్లోరీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు. ఇక బీబీ జోడి(BB jodi) ప్రోగ్రామ్ అయితే ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు అరియానా.
ఆ ఫోటోలలో ఆమె అసలు గుర్తు పట్టలేని విధంగా కనిపించారు. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిజంగా అవి అరియానా ఫోటోలేనా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అరియానా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. తాజా లుక్‌లో అరియానా కొంచెం లావైనట్టు కనిపిస్తున్నది. డబుల్ చిన్‌తో ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇది చూసి ఫ్యాన్స్‌తో పాటు, కొందరు నెటిజన్లు కూడా అరియానాపై వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి బాగా తిని పడుకుంటున్నావా? మరీ టూ మచ్ లావు అయ్యావు అని కొందరు కామెంట్ చేస్తే, గతంలోలా సన్నగా ఉంటేనే చూడ్డానికి బాగుంటావు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఆనారోగ్యంతో బాధపడుతున్నావా? అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పి పెళ్లి కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా ఏమిటీ అని కొందరు అడిగితే, వీలైనంత తొందరగా మళ్లీ సన్నగా అవ్వండని సలహాలు ఇస్తున్నారు. ఇలా ఎవరికివారు తమకు తోచినట్టు కామెంట్లు చేస్తున్నారు.