✕
Ashu Reddy Car Gifted to Her Mother : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అష్షు రెడ్డి... హాట్ బ్యూటీ వీడియో వైరల్.. !
By EhatvPublished on 3 April 2023 7:47 AM GMT
అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సామాన్యుడికైనా.. స్టార్లకైనా. అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. కఠిన హృదయాల మాట పక్కన పెడితే.. అమ్మవిలువ తెలిసిన వారు ఎవరైనా.. అమ్మ కోసం తమకు చేతనైనంతలో.. ఏదొ ఒకటి చేసి.. సంతోషపెట్టాలని చూస్తుంటారు. చిన్నవారు చిన్నబహుమతులు.. పెద్ద వారు పెద్ద బహుమతులు ఇస్తుంటారు.

x
Ashu Reddy
-
- అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సామాన్యుడికైనా.. స్టార్లకైనా. అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. కఠిన హృదయాల మాట పక్కన పెడితే.. అమ్మవిలువ తెలిసిన వారు ఎవరైనా.. అమ్మ కోసం తమకు చేతనైనంతలో.. ఏదొ ఒకటి చేసి.. సంతోషపెట్టాలని చూస్తుంటారు. చిన్నవారు చిన్నబహుమతులు.. పెద్ద వారు పెద్ద బహుమతులు ఇస్తుంటారు.
-
- ముఖ్యంగా సినిమా స్టార్లు తమ మాతృమూర్తులకు ఏదో ఒక బహుమతి ఇస్తుండటం చూస్తూనే ఉంటాం. సర్ ప్రైజ్ చేస్తూ.. పెద్ద పెద్ద బహుమతులిచ్చి.. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్‌లు అవుతుంటారు స్టార్లు. రీసెంట్గా బుల్లితెర బ్యూటీ.. సోషల్ మీడియా స్టార్ అష్షురెడ్డి (Ashu Reddy) కూడా ఇలానే తన తల్లి కోసం ఓ కాస్ట్లీ గిఫ్ట్ అందించి హడావిడి చేసింది. తన తల్లిని సర్ ప్రైజ్ చేసింది బ్యూటీ.
-
- బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి (Ashu Reddy) గురించి అందరికి తెలిసిందే.. పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇన్‌స్టాలో సూపర్ హాట్ ఫొటోతో.. కుర్రాళ్ల మధ్య కాకపుట్టించి కేకపెట్టిస్తుంటుంది బ్యూటీ.. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీ అకేషన్స్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటుంది.
-
- తాజాగా ఈ బ్యూటీ తన తల్లికి ఖరీదైన కారు (Car)ను బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. అషూ రెడ్డి (Ashu Reddy) అమ్మ పుట్టిన రోజు సందర్భంగా తనకు ఇలా కారును గిఫ్ట్‌గా ఇచ్చి షాక్ ఇచ్చింది అష్షురెడ్డి. ఇక ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ. దాంతో వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
- బిగ్‌బాస్ (Big Boss) తెలుగు సీజన్-3లోకి వెళ్లింది అష్షు రెడ్డి.. అప్పటి వరకూ టిక్ టాక్ (Tik Tok) వీడియోలకే పరిమితం అయిన ఈమె.. బిగ్‌బాస్ (Big Boss)కు వెళ్ళడంతో ఆమె ఇమేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జూనియర్ సమంతలా పేరు తెచ్చుకున్న అషూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు.
-
- ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. ‘చల్ మోహన్ రంగ’ (Chal Mohan Ranga), పీకే (#pk) వంటి చిత్రాలతో అష్షు రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ అనే పాటలో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)తో కలిసి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కనిపించిన ఈ భామ ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ప్రస్తుతం ఈమెకు ఇన్స్టాగ్రామ్ (Instagram)లో 1.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story