Health Benefits of Flax Seeds: అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
అవిసె గింజల్లో (Flax Seeds)అధికంగా ఉండే.. 'ఒమెగా 3' ఫ్యాటీ యాసిడ్లు గుండె సమస్యలను రాకుండా చూస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసె గింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయం నీళ్లు తీసివేసి గింజలను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి.

Flax Seeds Benefits
అవిసె గింజలు ..వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు.. వీటిని రోజు వారి డైట్ లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్(Fiber) యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యంతో పాటు చర్మం, జుట్టు , ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజల్లో (Flaxseeds) ఆరోగ్య కర(Healthy)ఫ్యాట్స్, ఫైబర్ (పీచు పదార్థం ఉంటాయి. ఇవి మనకు ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు అవిసె గింజలు తినడం వల్ల ఎంతో సులభంగా బరువు తగ్గవచ్చు. కొంతమందిలో శరీరంలో అధిక కొవ్వు పేరుకుని పోవడం... తద్వారా ఆ కొవ్వు గుండెకి పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారంగా... అవిసె గింజలు (Flaxseeds) తినమని నిపుణులు సూచిస్తున్నారు.
అవిసె గింజల్లో (Flax Seeds)అధికంగా ఉండే.. 'ఒమెగా 3' ఫ్యాటీ యాసిడ్లు గుండె సమస్యలను రాకుండా చూస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసె గింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయం నీళ్లు తీసివేసి గింజలను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే 'అలసట' నుంచి ఉపశమనం పొందవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవిసె గింజల్లో (Flax Seeds)పలురకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలున్నాయి.
అవిసె గింజలను ఉదయాన్నే తింటే శక్తి బాగా అందుతుంది. అవిసెల్లో ఉండే ఫైబర్ (Fiber)జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమ్యసలు ఉండవు. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మోనోపాజ్ దశలోని మహిళల సమస్యలకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. అవిసె గింజలను వేయించుకుని కూడా తినవచ్చు. రుచికి కూడా చాలా బాగుంటాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌ని అల్ఫా-లైనోలెనిక్ యాసిట్ (ALA) అంటారు. ఇవి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటి సమస్యలు తగ్గిపోవాలంటే అవిసె గింజలు తినడం వల్ల ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు. అవిసె గింజల్లోని ఫైబర్, ఫైటోస్టెరాల్స్, ఒమేగా-3 వంటివి గుండెకు బలాన్నిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందువల్ల ఓట్స్, సలాడ్స్, ఇతర చిరుతిళ్లతో కలిపి అవిసె గింజల్ని తినడం అలవాటు చేసుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
