Allu Arjun- JR.NTR : క్యూలో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్(secunderabad) కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక(By elections) పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలలో ప్రజల సందడి కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఆరున్నర గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు కట్టారు. టాలీవుడ్ హీరోలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్(secunderabad) కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక(By elections) పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలలో ప్రజల సందడి కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఆరున్నర గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు కట్టారు. టాలీవుడ్ హీరోలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), అల్లు అర్జున్‌లు(Allu Arjun) క్యూలో నిలబడి ఓటు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి, భార్యలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరితో కలిసి క్యూలైన్‌లో నిల్చున్నారు. తన వంతు వచ్చినప్పుడు ఆయన ఓటు వేశారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా ఉదయాన్నే ఓటు వేశారు. ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో(BSNL) ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్ అందరితోపాటు ఆయన తన వంతు కోసం క్యూలైన్‌లో వేచిఉండి ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తన సతీమణితో కలిసి ఫిలింనగర్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలలో ఓటు వేస్తే, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాదాపూర్‌లో ఓటేవేశారు.