హీరోయిన్‌ శ్రీలీల(sreeleela) అచిర కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. పాతికేళ్లు కూడా లేవు కానీ స్టార్‌ హీరోయిన్లకు వణకు పుట్టిస్తున్నది శ్రీలీల. అదృష్టం అంటే ఆమెదే మరి! స్టార్‌ హీరోల దగ్గర నుంచి యంగ్‌ హీరోస్‌ వరకు అందరి ఛాయిస్‌ శ్రీలీలనే! ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. డేట్స్‌ అసలు ఖాళీ లేవు. ప్రస్తుతం ఆమె చేతిలో పది సినిమాలున్నాయి.

హీరోయిన్‌ శ్రీలీల(sreeleela) అచిర కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. పాతికేళ్లు కూడా లేవు కానీ స్టార్‌ హీరోయిన్లకు వణకు పుట్టిస్తున్నది శ్రీలీల. అదృష్టం అంటే ఆమెదే మరి! స్టార్‌ హీరోల దగ్గర నుంచి యంగ్‌ హీరోస్‌ వరకు అందరి ఛాయిస్‌ శ్రీలీలనే! ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. డేట్స్‌ అసలు ఖాళీ లేవు. ప్రస్తుతం ఆమె చేతిలో పది సినిమాలున్నాయి. అంత బిజీగా ఉన్నారన్నమాట! తెలుగు మూలాలున్న శ్రీలీల అమెరికాలో జన్మించింది. మూడేళ్ల వయసులోనే ఆమె నృత్యాన్ని నేర్చుకుంది. మొదట కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కన్నడ సినిమారంగంలో ఓ మాదిరి గుర్తింపును తెచ్చుకున్న పెళ్లిసందD సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ శ్రీలీలకు మాత్రం బోల్డంత పేరు వచ్చింది. దీని తర్వాత రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన ధమాకాలో(Dhamaka) హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా శ్రీలీలకు ఎంతో పేరు తెచ్చింది. యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులను కూడా అదరగొట్టింది. ధమాకా హిట్‌ కొట్టడంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పది సినిమాలలో అయిదు సినిమాలు వచ్చే ఆరు నెలలలో విడుదల కాబోతున్నాయి. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్(vaishnav tej) కథానాయకుడిగా వస్తున్ ఆదికేశవ సినిమా ఆగస్టు 18న విడుదల కాబోతున్నది. రామ్‌(Ram) హీరోగా వస్తున్న స్కంద(skanda) సినిమా సెప్టెంబర్‌ 18వ తేదీన రిలీజ్‌ కానుంది. బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న భగవంత్‌ కేసరి(Bhagavanth kesari) అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. నితిన్‌(Nithin) ఎక్స్‌ట్రా సినిమా డిసెంబర్‌ 23న, మహేశ్‌బాబు గుంటూరు కారం జనవరి 13న థియేటర్లలోకి రానున్నాయి. గతంలో ఓ హీరోయిన్ నటించిన రెండు మూడు చిత్రాలు వరస నెలలలో విడుదలయ్యాయి. కానీ ఇలా అయిదే సినిమాలు, అది కూడా ఇంత తక్కువ టైంలో రావడం మాత్రం బహుశా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇవే కాకుండా పవన్ కల్యాణ్(Pawan kalyan) 'ఉస్తాద్ భగత్ సింగ్', నవీన్ పోలిశెట్టి(naveen polishetty) 'అనగనగ ఒక రాజు'తో పాటు మరిన్న చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి.

Updated On 2 Aug 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story