ఆయనేం మామూలు సాధారణ వ్యక్తి కాదు. బాగా చదువుకున్నవారు. మేధావి అన్న పేరు కూడా ఉంది. అన్నింటికీ మించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త! ఇలాంటి వ్యక్తి నుంచి బూతు మాటలు వస్తాయని ఎవరైనా అనుకుంటారా? పోనీ మాస్‌ లీడర్‌ కాబట్టి అలాంటి మాటలు మాట్లాడారని అనుకున్నా ఆ దృశ్యమూ కూడా ఆయనకు లేదు. ఆ మాటకొస్తే ఆయన లీడరే కాదు. ఏదో ప్రజారాజ్యం పార్టీ పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడైనా ఉన్నారా? ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులోనే ప్రెస్‌మీట్‌ పెట్టి చిరంజీవిపైనే విమర్శలు చేసి, అక్కడే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఆయనేం మామూలు సాధారణ వ్యక్తి కాదు. బాగా చదువుకున్నవారు. మేధావి అన్న పేరు కూడా ఉంది. అన్నింటికీ మించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitaraman) భర్త! ఇలాంటి వ్యక్తి నుంచి బూతు మాటలు వస్తాయని ఎవరైనా అనుకుంటారా? పోనీ మాస్‌ లీడర్‌ కాబట్టి అలాంటి మాటలు మాట్లాడారని అనుకున్నా ఆ దృశ్యమూ కూడా ఆయనకు లేదు. ఆ మాటకొస్తే ఆయన లీడరే కాదు. ఏదో ప్రజారాజ్యం పార్టీ పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడైనా ఉన్నారా? ప్రజారాజ్యం పార్టీ(Praja Rajyam Party) ఆఫీసులోనే ప్రెస్‌మీట్‌ పెట్టి చిరంజీవి(chiranjeevi)పైనే విమర్శలు చేసి, అక్కడే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత విశాలాంధ్ర అంటూ కొన్నాళ్లు కనిపించారు. ఆ మధ్య టీవీ ఛానెల్‌లో చేరారు. ఇప్పుడాయన ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. మొన్నటి నుంచి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అందుకు కారణం సోషల్ మీడియాలో(Social Media)) ఆయన వాడిన భాషే! దీని పూర్వాపరాలు తెలియాలంటే ఓ నాలుగైదు రోజుల ముందుకెళ్లాలి. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలోనే ఉండి టికెట్లు అమ్ముకుంటున్నారని అప్పట్లో ఆయన చేసిన ఆరోపణలు ఇప్పటికీ చిరంజీవి అభిమానులను గాయంలా సలుపుతూనే ఉన్నాయి. వీలున్నప్పుడల్లా సోషల్‌ మీడియాలో పరకాల మీద విరుచుకుపడుతుంటారు. ఆయన కూడా వారికి తగు విధంగా సమాధానం చెబుతూనే ఉంటారు. మొన్నటికి మొన్న ఓ నెటిజన్‌ ప్రజారాజ్యం పార్టీ గురించి చిన్నపాటి వ్యాసమే ట్వీట్‌ చేశాడు. దాని కింద ఓ చిరంజీవి అభిమాని స్పందిస్తూ పరకాలను విపరీతంగా దుర్భాషలాడాడు. 'అరేయ్ పరకాలగా. డబ్బులకు అమ్ముడుపోయి పీఆర్పీ లాంటి ఉన్నత విలువలు ఉన్న ఒక పార్టీ మీద విషం కక్కావు. కర్మ ఎవరినీ వదలదు రా. కుక్క చావు చస్తావు.

ఏపీ ప్రజలకి ఒక మంచి సీఎంని మిస్ చేయించావ్'అంటూ ట్వీటాడు. ఇది తప్పే.. పరకాల గురించి ఇలాంటి భాషను వాడకూడదు.. అతడికి పరకాల మంచి మాటలతో లెసన్‌ తీసుకోవచ్చు. కానీ పరకాల అలా చేయలేదు. తన స్థాయికి తగినట్టుగా ప్రవర్తించలేదు.. "ఆ రోజుల్లో నీ అమ్మని రోజూ మింగేవోడినని నీకున్న కోపం ఇప్పుడు ఇలా వాగి తీర్చుకుంటున్నావు. పాపం నీ బాధ అర్థం అయింది" అంటూ పరకాల రీ ట్వీట్‌ చేశారు.. ఇది చాలా పెద్ద తప్పు.. ఒక అక్షరం మార్చినంత మాత్రనా పరకాల ఏ బూతుమాట వాడారో తెలియనంత అజ్ఞానంలో జనం లేరు. అంత పెద్ద మనిషి వాడే మాట కాదు ఇది! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సలహాదారుగా కూడా ఉన్నారు పరకాల. ఇలాంటి హై ప్రొఫైల్ వ్యక్తి ట్విట్టర్ లో తనను ట్రోల్ చేసే చిరంజీవి, పవన్‌ అభిమానులకు ఇంత చీఫ్‌గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ ట్వీట్‌ చూసి చాలా మంది అయోమయం చెందారు. అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందేమోనని అనుకున్నారు. ఇదే విషయాన్ని పరకాలను అడిగినప్పుడు . తన ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్ కాలేదని, తాను కూడా ఇలాంటి భాష వాడగలనని చెప్పడానికి ఇలాంటి ట్వీట్ చేశానని ఆయన సమర్థించుకున్నారు. ఇక్కడితో ఆయన ఆగలేదు. పవన్‌పై సెటైర్లు వేశారు. ' ఒక్క మాటకే గింగిరాలు తిరిగిపోతున్న నా కొడకల్లారా, నాతో పెట్టుకుంటే మీ కన్నా చెత్త భాష వాడి మిమ్మల్ని నానా తిట్లూ తిట్టగలను. ఖబడ్దార్‌! పోయి, రెండింట్లో ఒకటి ఓడిన మీ దాకమొహం నాయకుడికో, రెండుకు రెండు ఓడిన మీ పిత్తపరిగి నాయకుడికో చెప్పుకోండి' అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్‌ వదిలారు. 'అసలుగాళ్లు అన్నీ మూసుకు కూర్చుంటే ఇక్కడ ఈ కొసరు కుక్కగాళ్లు వగరుస్తున్నారు. మొరిగే బదులు పోయి నాలుగు వోట్లు అడుక్కొడెహె, ప్యాకేజీ పార్టీల నాయాళ్లలారా!' అంటూ వ్యాఖ్యానించారు.

నిజానికి పరకాల ట్వీట్‌కు ముందు జనసైనికులు కానీ, చిరంజీవి ఫ్యాన్స్‌ కానీ బూతులు వాడలేదు. ప్రజారాజ్యం పార్టీకి వెన్నుపోటు పొడిచారన్న కోపమే వారిలో ఉండింది. ఇంతదానికే పరకాల ఇరిటేట్‌ అవ్వాల్సిన పనిలేదు. అయితే గతంలో కూడా పరకాల బూతులు వాడారని, అందుకు సాక్ష్యాలుగా గతంలో ఆయన చేసిన ట్వీట్‌లను చూపిస్తున్నారు. తాజాగా పరకాల మరో ట్వీట్‌ను వదిలారు.
హెడ్‌లైన్స్‌
నిన్నటి చింపుల్‌ కొచ్చెన్‌కి కూడా జవాబు ఇవ్వలేకపోయిన గజ్జి బ్యాచ్‌!
అసహనంతో 'పూ' గుణింతపు బూతు పురాణం లంకించుకున్న నేల టికెట్‌-ఈల బ్యాచ్‌!
రోజురోజుకూ నీరసిస్తున్న పిత్తపరిగి సైన్యం!
మొదటి రోజున 385, రెండో రోజు 325. ఇవాళ మూడో రోజు మరీ ఘోరంగా 154కు పడిపోయిన తిట్లు- శాపనార్థాల ట్వీట్లు!
వెనక కాళ్ళ మధ్య తోకలు దోపుకుని పరుగులు తీస్తున్న గజ్జి కుక్కల బ్యాచ్‌!
ఆఫీసులో ఇస్తున్న ట్వీట్‌కి పావలా రేటు పట్ల ఈల బ్యాచ్‌ అసంతృప్తి!
పోనీ ఈవాళ ఇంకా వీజీ కొచ్చెన్‌ ఇస్తాను. ట్రై చెయ్యండి. రేపటికి రేటు ఏమైనా కిట్టుబాటు అవుతుందేమొ చూడండి:
బీవారం గిలాసు
ఈ మాటలు విని ఈ ఖాళీలను పూర్తి చెయ్యండి:
—ఛెళ్లుమంది,-గుయ్యిమంది,— పగిలింది
(ఎవరినైనా అడిగి కూడా పూర్తి చేయవచ్చు)
సో, రేపు పనులు ముగించుకుని తీరికయ్యాక ఇంకా మిగిలిన ఉన్న గజ్జి బ్యాచ్‌కి బడిత పూజ
సీయూ...

ఇది ఆయన ట్వీట్‌.. చూశారుగా పరకాల ప్రభాకర్‌ భాష పటిమ! ఎదుటివాళ్లు ఎంతగా రెచ్చగొట్టినా పరకాల వంటి వారు సహనం కోల్పోకూడదు. స్థితప్రజ్ఞతతో ఉండాలి.. కానీ పరకాల కూడా అదుపు తప్పారని, వాడకూడని భాషను వాడుతున్నారని చాలా మంది అంటున్నారు..

Updated On 8 April 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story