వ్యూస్‌ కోసం యూ ట్యూబర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. పాపులారిటీ కోసం స్టంట్లు చేస్తున్నారు. ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. లేటెస్ట్‌గా కిల్‌బిల్‌లో ఉమా థుర్మాన్‌(Uma Thurman) పాత్రలాగే ఓ పాపులర్‌ యూట్యూబర్‌ మతిలేని పని చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఏడు రోజుల పాటు సజీవ సమాధిలోకి వెళ్లాడు.

వ్యూస్‌ కోసం యూ ట్యూబర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. పాపులారిటీ కోసం స్టంట్లు చేస్తున్నారు. ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. లేటెస్ట్‌గా కిల్‌బిల్‌లో ఉమా థుర్మాన్‌(Uma Thurman) పాత్రలాగే ఓ పాపులర్‌ యూట్యూబర్‌ మతిలేని పని చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఏడు రోజుల పాటు సజీవ సమాధిలోకి వెళ్లాడు. బీస్ట్‌గా పాపులర్‌ అయిన జిమ్మీ డొనాల్డ్‌సన్‌(Jimmy Donaldson) ఈ సాహసం చేశాడు. వారం రోజుల పాటు శవపేటిక వంటి డబ్బాలో భూమిలోపల ఉండిపోయాడు. ఈ స్టంట్‌ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వీడియో అప్‌లోడ్‌ చేయగా రెండు రోజుల్లోనే 64 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. తన 212 మిలియన్ల యూట్యూబ్‌ సబ్‌ స్క్రైబర్‌లను అట్రాక్ట్‌ చేసుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రాణాంతకమైన ఫీట్‌ చేశాడు. అంతా చేసి చివరకు ఈ ఫీట్‌ను పొరపాటున కూడా ఎవరూ ప్రయత్నించకండి అంటూ ఓ సూచన చేశాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ఫీట్‌ను చేసిన జిమ్మీ డొనాల్డ్‌సన్‌ 'రాబోయే ఏడు రోజులు నా జీవితాన్ని ఈ శవపేటికకు అప్పగిస్తున్నాను'అని చెబుతూ శవపేటికలో దూరిపోయాడు. దానిమీద 20వేల పౌండ్ల మట్టిని పోయించాడు. అయితే పైన ఉన్న తన బృందానికి అత్యవసరం పడితే ఏదైనా సందేశం పంపడానికి వాకీ-టాకీని ఉపయోగించాడు. అయినప్పటికీ వారం రోజుల పాటు శవపేటికలో ఉండటం చాలా చాలా కష్టం. ఏడు రోజుల తర్వాత బయటకు వచ్చిన జిమ్మీ డొనాల్డ్‌సన్‌కు ప్రాణం పోయినంత పనైంది. బాగా నీరసించాడు. కాళ్లు తిమిరెక్కాయి. రక్త ప్రసరన ఆగిపోయింది. చాలా సేపటి వరకు నిలబడలేకపోయాడు. అతడి అదృష్టం బాగుండబట్టి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు కానీ లేకపోతే టపా కట్టేసి ఉండేవాడు. రెండేళ్ల కిందట 50 గంటల పాటు సజీవంగా సమాధి అయ్యి రికార్డు సాధించాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలమయ్యింది. 2012 నుంచి యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటున్న జిమ్మీ డొనాల్డ్‌సన్‌ 2018లో బీస్ట్‌గా పాపులరయ్యాడు. అఫ్రికాలోని అయిదు లక్షల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆఫ్రికా అంతటా వంద బావులను తప్పించే పేరుతో డబ్బులు వసూలు చేయడంపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి.

Updated On 22 Nov 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story