ఓ యువకుడు కోటి రూపాయలు పెట్టి ఓ లగ్జరీ కారు కొనేసుకుందామనుకున్నాడు. కొన్న కారు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. అలా చేస్తే తను కారు కొన్న సంగతి కొందరికే తెలుస్తుంది..

ఓ యువకుడు కోటి రూపాయలు పెట్టి ఓ లగ్జరీ కారు కొనేసుకుందామనుకున్నాడు. కొన్న కారు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. అలా చేస్తే తను కారు కొన్న సంగతి కొందరికే తెలుస్తుంది.. మరి చాలా మందికి తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేసినా వినూత్నంగా చేయాలి. అప్పుడే కదా నలుగురి దృష్టిలో పడతామని అనుకున్న క్రేజీ ఎక్స్‌వైజడ్‌ అనే యూట్యూబర్‌(Youtuber) ఓ బ్రహ్మండమైన ఆలోచన చేశాడు. తన ఆలోచనను ఇంప్లిమెంట్‌ చేశాడు.

కోటి రూపాయల విలువైన పోర్షే 718 బాక్స్‌స్టర్‌ను(Porsche 718 Boxster) కొన్నాడు. అంతకు ముందే షోరూమ్‌ సిబ్బందితో తాను పోర్షే కారును కొందామనుకుంటున్నానని చెప్పి ఆ కారు వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే షో రూమ్‌ బయట ఉన్న తన కారులో ఉన్న పెద్ద పెద్ద మూటలను తెచ్చి షోరూమ్‌ సిబ్బందికి ఇచ్చాడు. ఆ మూటల్లో ఏమున్నాయంటే ఒక రూపాయి నాణేలు(One Rupee Coins). మూటలు చూసి షోరూమ్‌ సిబ్బంది బిత్తరపోయారు. చేసేదేమీ లేక కాయిన్స్‌ను రాశులగా పోసి లెక్కించారు. మొత్తం లెక్కించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. ఈ తతంగాన్ని ఆ యూట్యూబర్‌ వీడియో షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

Updated On 12 Aug 2023 6:09 AM GMT
Ehatv

Ehatv

Next Story