ఆ ఇద్దరూ విజయవాడలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో కలిశారు. వారి మధ్య పరిచయం ప్రేమగా ఏర్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయం ఇద్దరికీ కలిగింది. కలిసి బతకలేకున్నా కలిసి చనిపోదామన్న బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తిరుపతి జిల్లా గూడూరు దగ్గర ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఆ ఇద్దరూ విజయవాడలోని(Vijayawada) ఓ కోచింగ్‌ సెంటర్‌లో(Coaching center) కలిశారు. వారి మధ్య పరిచయం ప్రేమగా ఏర్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయం ఇద్దరికీ కలిగింది. కలిసి బతకలేకున్నా కలిసి చనిపోదామన్న బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తిరుపతి జిల్లా గూడూరు దగ్గర ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు(Guntur) జిల్లా శ్రీరుక్ముణిపురానికి చెందిన పావని(Pavani) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసింది. చిల్లకూరు మండలంలోని ఓ హోటల్‌లో పనిచేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా సగిపాడుకు చెందిన దండే రాకేష్‌(Dhanda Rakesh) (23)కు పోన్‌ చేసి గూడూరు రావాలని కోరింది. పావని ఫోన్‌ చేయడంతో గూడురుకు రాకేష్‌ చేరుకున్నాడు. ఇద్దరూ కలుసుకొని చాలా సేపు ముచ్చటించారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే.. విడివిడిగా కలిసి బతకలేమనుకున్న ఈ జంట కలిసి చనిపోదామన్న విషాద నిర్ణయానికి వచ్చారు. గూడూరు రైల్వే స్టేషన్(Railway Station) నుంచి దాదాపు 3 కి.మీ. దూరం వరకు ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లారు. గాంధీనగర్‌ దగ్గర రైలు పట్టాలపై పడుకున్నారు. వారిపై నుంచి గూడ్స్‌ రైలు(Goods Rails) దూసుకెళ్లడంతో ఇద్దరు తలలు తెగిపడ్డాయి. ఈ విషాద ఘటన గూడూరు ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రేమించుకుని ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ రావడంతో.. మృతదేహాలను గూడూరు ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను చూసి పావని, రాకేష్‌ తల్లిదండ్రుల రోదనలను చూసి చుట్టుపక్కల వారు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేమిస్తే ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోవాలని.. అంతే కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకొని అర్ధాంతరంగా జీవితాలను ముగించి తమ కుటుంబాల్లో తీవ్ర మానసిక వేదన మిగల్చకూడదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

Updated On 21 Nov 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story