కుక్కలను(Dog) అల్లారు ముద్దుగా పెంచుకునేవాళ్లను చూశాం. వాటికి ఖరీదైన ఆహారాన్ని(Food) పెట్టేవారినీ చూశాం. ఇంట్లో ఓ మెంబర్‌గా చూసుకుంటూ, పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపే శునక ప్రేమికులను కూడా చూశాం.. కానీ కుక్క కోసం అత్యంత ఖరీదైన ఇంటిని(Home) నిర్మించిన వ్యక్తిని మాత్రం చూసి ఉండం.

కుక్కలను(Dog) అల్లారు ముద్దుగా పెంచుకునేవాళ్లను చూశాం. వాటికి ఖరీదైన ఆహారాన్ని(Food) పెట్టేవారినీ చూశాం. ఇంట్లో ఓ మెంబర్‌గా చూసుకుంటూ, పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపే శునక ప్రేమికులను కూడా చూశాం.. కానీ కుక్క కోసం అత్యంత ఖరీదైన ఇంటిని(Home) నిర్మించిన వ్యక్తిని మాత్రం చూసి ఉండం. చూడాలనుకుంటే మాత్రం అమెరికాలోని(america) కాలిఫోర్నియాకు(California) వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నివాసం ఉంటున్న బ్రెంట్‌ రివెరా(Brent Rivera) అనే పాతికేళ్ల కుర్రాడు తన కుక్క చార్లీ(charlie) కోసం ఓ లగ్జరీ హౌస్‌ను ఏర్పాటు చేశాడు. ఆ శునకరాజం మొదటి పుట్టిన రోజును పురస్కరించుకుని దానికి ఈ కానుకను సమర్పించుకున్నాడు.

ఆ ఇంట్లో కుక్క కూర్చోవడానికి ఓ కుర్చీ, సోఫా, టేబుల్‌, ఫ్రిజ్‌, టీవీ ఇలా సమస్త సామాగ్రిని ఏర్పాటు చేశాడు. ఆ ఇంటికి డ్రీమ్‌ డాగ్‌ హౌస్‌ అని నామకరణం చేశాడు బ్రెట్‌ రివెరా. యూ ట్యూబర్‌ అయిన రెవెరా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. తన చార్లీ హాయిగా పడుకునేందుకు విలాసవంతమైన బెడ్‌ను కూడా అరెంజ్‌ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ మనిషికి కావాల్సిన అన్ని వసతులను కుక్కగారికి ఏర్పాటు చేశాడు. అన్నట్టు ఆ ఇంటి వెలుపల చార్లీ హౌస్‌ అని గోల్డెన్‌ లెటర్స్‌తో బోర్డు కూడా రాయించాడు. దీనిపై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్‌ రియాక్షన్‌ వస్తోంది. హాయిగా, హుషారుగా తిరుగుతూ ఉండే కుక్క జీవితాన్ని బంధించి మీరే పాడు చేస్తున్నారని కామెంట్‌ చేస్తున్నారు.

Updated On 1 Jun 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story