London Hotel : ఆ హోటల్‌లో అవమానాలు, పరాభవాలు.. అయినా క్యూ కడుతున్న జనం
ఉగాది (Ugadi)వేళ పంచాంగం వెతుక్కుని రాజ్యపూజ్యం-అవమానం చూసుకోవడం చాలా మందికి అలవాటు. అవమానం అన్నది మచ్చుకైనా లేనివారు ఉండరనుకోండి. సపోజ్ పర్‌సపోజ్ ఉన్నారే అనుకుందాం! అలాంటి వారు అవమానాలను కొనుక్కోవచ్చు. అందుకోసం వారు లండన్‌లోఉన్న కరెన్ హోటల్‌కు(Karan Hotel) వెళ్లాల్సి ఉంటుంది. కాస్త ఖరీదైన హోటలే సుమా! ఒకరోజు రాత్రి బస చేయాలంటే 20 వేల రూపాయలను సమర్పించుకోవాల్సి ఉంటుంది.
ఉగాది (Ugadi)వేళ పంచాంగం వెతుక్కుని రాజ్యపూజ్యం-అవమానం చూసుకోవడం చాలా మందికి అలవాటు. అవమానం అన్నది మచ్చుకైనా లేనివారు ఉండరనుకోండి. సపోజ్ పర్‌సపోజ్ ఉన్నారే అనుకుందాం! అలాంటి వారు అవమానాలను కొనుక్కోవచ్చు. అందుకోసం వారు లండన్‌లోఉన్న కరెన్ హోటల్‌కు(Karan Hotel) వెళ్లాల్సి ఉంటుంది. కాస్త ఖరీదైన హోటలే సుమా! ఒకరోజు రాత్రి బస చేయాలంటే 20 వేల రూపాయలను సమర్పించుకోవాల్సి ఉంటుంది. 20 వేల రూపాయలిచ్చి రూమ్ అద్దెకు(Room Rent) తీసుకుని హోటల్‌కు వెళతామనుకోండి! మనకు టీ నో కాఫీనో తాగాలనిపిస్తుంది. రూమ్‌లో టీ కెటిల్ ఉండదు. దాని హ్యాండిల్ మాత్రము ఉంటుంది. మనం చాలా పొలైట్‌గా రిసెప్షన్‌కు(Reception) ఫోన్ చేసి ప్రాబ్లమ్‌ను చెప్పుకుంటాం! అక్కడ్నుంచి మాత్రం చాలా కటువుగా జవాబు వస్తుంది. మీకు టీ తాగాలనిపిస్తే వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండి అంటూ గట్టిగా అరుస్తూ ఓ మహిళ గొంతు వినిపిస్తుంది. థూనాబచె. ఇంత అవమానమా అని అనుకోకండి. ఆ రిసెప్షనిస్ట్‌కు తాను ఏం చేయాలో ఆమెకు బాగా తెలుసు! అందుకే ఆమెకు ఆ ఉద్యోగం ఇచ్చారు. ఆమె డ్యూటీ ఏమిటంటే హోటల్‌కు వచ్చినవారిని గట్టిగా అవమానించడం(Insult)! నిజానికి ఆ హోటల్‌కు వెళ్లేదే అవమానం పాలవ్వడానికి!
చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వెళుతుంటారు. ఈ హోటల్ కథనం డైలీ మెయిల్‌లో (Dily Main)వచ్చింది. 20 వేలు తీసుకున్నా కనీస సదుపాయాలేమీ అక్కడ దొరకవు. టవల్స్(Towels), టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్‌లో బస చేయడానికి వచ్చినవారు కనీస అవసరాల గురించి హోటల్ సిబ్బందిని అడిగితే వారు తీవ్రంగా అవమానిస్తారు. అసభ్యకరమైన తిట్లను కూడా తిడతారు. మరి ఇలాంటి హోటల్‌కు ఎవరెళతారు? అన్న డౌటే అక్కర్లేదు. ఇలంటి వ్యవహారం కారణంగానే ఈ కరెన్ హోటల్ ఫేమస్(Famous) అయ్యింది. తీవ్రంగా అవమానం పాలవ్వడానికే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ మరెక్కడా లేదు. అన్నట్టు ఈ హోటల్‌కు రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ అవమానకర సేవలను ప్రారంభించింది. తర్వాత బ్రిటన్ అంతటా డైనర్ రెస్టారెంట్ శాఖలు విస్తరించాయి.