Costly Cow in World : ఆ ఆవుధర వింటే గుండాగి పోవడం ఖాయం!
సాధారణంగా ఓ ఆవు రేటు ఎంతుంటుంది? ఓ యాభై వేలుంటుందేమో! కాసింత మేలు జాతి ఆవు అయితే ఓ లక్ష పలుకుతుందంతే! ఇప్పటి వరకు మనం ఇదే ఒపీనియన్‌తో ఉన్నాం కదా! ఇక నుంచి మన అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎంచేతంటే బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన ఓ వేలం పాటలో నెల్లూరు జాతికి చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక రధ పలికింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యం ఖరీదైన ఆవు ఇదే
సాధారణంగా ఓ ఆవు రేటు ఎంతుంటుంది? ఓ యాభై వేలుంటుందేమో! కాసింత మేలు జాతి ఆవు అయితే ఓ లక్ష పలుకుతుందంతే! ఇప్పటి వరకు మనం ఇదే ఒపీనియన్‌తో ఉన్నాం కదా! ఇక నుంచి మన అభిప్రాయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎంచేతంటే బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన ఓ వేలం పాటలో నెల్లూరు జాతికి చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక రధ పలికింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యం ఖరీదైన ఆవు ఇదే! నెల్లూరు జాతి ఆవు బ్రెజిల్‌కు ఎలా వెళ్లిందనేగా మీ డౌటు! ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందటే కొన్ని ఆవులను బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. జన్యు లక్షణాలను మరింతగా అభివృద్ధి చేశారు.. సరే.. ఇప్పుడు మళ్లీ ఆవు ధర విషయానికి వద్దాం.
వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్‌విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు రేటు 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యమైన జన్యు లక్షణాలు ఉన్న బ్రెజిల్‌లోని ఈ నెల్లూరు జాతి ఆవును రికార్డు రేటుకు సొంతం చేసుకోవడానికి డెయిరీ వ్యాపారులు పోటీ పడ్డారట. బ్రెజిల్‌లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. సాధారణంగా వీటిని ఎక్కువగా మాంసం కోసమే పెంచుతుంటారు. ఈ ఆవుల మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలా దేశాలలో వీటి మాంసానికి చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో 16.70 కోట్ల నెల్లూరు జాతి అవులు ఉన్నాయట! ఈ జాతికి చెందిన ఎద్దుల వీర్యం అర మిల్లిలీటర్‌కు నాలుగు లక్షల రూపాయలు పలుకుతుంది. వీటికి ఎందుకంటే డిమాండ్ అంటే ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. చక్కగా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. వీటి చర్మం మందంగా ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వీటి దగ్గరకు రావు. రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే.. ఇన్ఫెక్షన్లను తట్టుకోగలవు. నాసిరకం గడ్డిని కూడా తిని ఆరగించుకోగలవు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనేస్తాయి. దూడలు కూడా సులువుగా పెరుగుతాయి.