సాధారణంగా చాలా మందికి కార్లు.. బైక్స్ అంటే విపరీతమైన ఇష్టముంటుంది. తమకు నచ్చిన బైక్, కార్ తీసుకోవడానికి ఎంత డబ్బు అయిన వెచ్చిస్తారు. అయితే తమ ఫేవరేట్ వెహికల్ తీసుకున్నాక.. అందుకు మంచి ఫ్యాన్సీ నంబర్(Fancy Number) కూడా పెట్టించాలనుకుంటారు. సామాన్యుల పరిస్థితి పక్కన పెడితే.. సెలబ్రెటీలు.. వ్యాపారవేత్తలకు మాత్రం తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నంబర్.. తన కారుకు ఉండాల్సిందే.

సాధారణంగా చాలా మందికి కార్లు.. బైక్స్ అంటే విపరీతమైన ఇష్టముంటుంది. తమకు నచ్చిన బైక్, కార్ తీసుకోవడానికి ఎంత డబ్బు అయిన వెచ్చిస్తారు. అయితే తమ ఫేవరేట్ వెహికల్ తీసుకున్నాక.. అందుకు మంచి ఫ్యాన్సీ నంబర్(Fancy Number) కూడా పెట్టించాలనుకుంటారు. సామాన్యుల పరిస్థితి పక్కన పెడితే.. సెలబ్రెటీలు.. వ్యాపారవేత్తలకు మాత్రం తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నంబర్.. తన కారుకు ఉండాల్సిందే. ఉదాహరణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‏(Jr.NTR)కు 9 అంటే చాలా ఇష్టం. తన బైక్స్.. కార్స్ అన్నింటికి 9 అనే నంబర్ ఉండాల్సిందే. తారక్ ఎంత ఖరీదైన లగ్జరీ కారు(Luxury Car) తీసుకున్నా.. దాని నంబర్ మాత్రం 9999 ఉండాల్సిందే. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైతం తాను మనసు పడి తీసుకున్న టొయోటా వెల్ ఫైర్ ధర రూ. 1.9 కోట్లు అని తెలుస్తోంది. ఈ వాహనం నంబర్ ప్లేట్ కోసం లక్షలు ఖర్చు చేశారట. ఫ్యాన్సీ నంబర్ 1111 కోసం చిరు ఏకంగా రూ. 4.70 లక్షలు వెచ్చించారు. వీళ్లే కాదు.. ప్రపంచంలోని పలువురు వ్యాపారవేత్తలు కూడా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ ధర రూ.123 కోట్లు.

దుబాయ్(Dubai)‏కు చెందిన ఓ పెద్ద బిజినెస్ మెన్ ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కోసం దాదాపు 55 మిలియన్ దిర్హామ్స్ (అంటే $15 మిలియన్స్.. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 123 కోట్లు) చెల్లించారట. ఇది దశాబ్ధం క్రితం యూఏఈలో ఉన్న రికార్డును బ్రేక్ చేసిందని బ్లూమ్ బెర్గ్(Bloomberg) నివేధించింది. నివేధికల ప్రకారం.. ఎమిరేట్స్ వేలం ఎల్ఎల్సీ ప్లేట్ నంబర్ P7ను విక్రయించింది. దీని నంబర్ కేవలం 7 మాత్రమే. కానీ పక్కనే P ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్ ను వేలం వేయగా.. దుబాయ్‏కు చెందిన షేక్ మహమ్మద బిన్ రషీద్ దీనిని సొంతం చేసుకున్నారు. యూఏఈ వానిటీ నంబర్ ప్లేట్స్ వేలం వేసే విధానాన్ని మొదలు పెట్టింది. ఇందులో అత్యంత సంపన్నులు తమ సంపదలు, స్థానం గురించి చారిటీ కోసం ఉపయోగిస్తారు. 2008లో స్థానిక వ్యాపారవేత్త సయీద్ అబ్దుల్ గఫర్ ఖౌరీ నంబర్ 1 కోసం 52.2 మిలియన్ దిర్హామ్స్ చెల్లించాడు.

ఇక అతని తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో హాంకాంగ్(Hong Kong) లో జరిగిన వేలంలో R అనే అక్షరంతో కూడిన నెంబర్ ప్లేట్ కోసం $25.5 మిలియన్స్ (3.2 మిలియన్స్) చెల్లించారు. 2016లో ప్రముఖ వ్యాపారవేత్త బల్విందర్ సింగ్ సాహ్ని D5 అనే నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హామ్స్ చెల్లించారు. ఇక ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ అంటే P7 మాత్రమే. దీని కోసం ఏకంగా 55 మిలియన్ దిర్హామ్స్ చెల్లించి రికార్డ్స్ బ్రేక్ చేశాడు.

Updated On 14 April 2023 11:51 PM GMT
Ehatv

Ehatv

Next Story