Work From Theater in Bengaluru : వర్క్‌ఫ్రమ్ థియేటర్.. బెంగుళూరు కంపెనీ నిర్వాకం.. వీడియో వైరల్.!
వర్క్‌ఫ్రమ్‌హోమ్ (work from home) కరోనా(carona) మొదలైన దగ్గర నుండి దాదాపుగా అందరు ఇళ్ళనుండి పని చేస్తున్న వారే .. సాఫ్ట్వేర్ఉద్యోగాల్లో క్షణం తీరిక ఉండదు ,రోజు సెలవుఉండదు . కరోనా పుణ్యమా అంటూ కొందరు ఈ ఇంటి దగ్గర నుండి పనిని ఎంజాయ్ చేస్తుంటే కొందరు మాత్రం ఇంట్లో ఏ పని చేయాలన్న ,ఎక్కడికి వెళ్లాలన్న ఖాళీ లేకుండా లాప్ టాప్ ముందు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు .చివరికి మొన్న ఆమధ్య పెళ్లి టైం లో కూడా పీటలమీద నుండి వధువు పని చేసిన ఘటన తెలిసిందే !

కరోనా కాలం ముగిసినప్పటికీ కంపెనీలు ఖర్చుతగ్గించుకొనే దిశలో ఉద్యోగస్తులను ఇంటి దగ్గర నుండి పని చేయటానికి ప్రత్యేకమైన ప్రోత్సాహాన్నిస్తున్నాయి . కొన్ని కంపెనీలు మాత్రం వారంలో రెండు రోజులు ఆఫీస్ లకు రావాల్సిందే అంటూ నియమాన్ని విధించారు . ఏది ఏమైనా 60% మంది టెక్కీలు మాత్రం ఇప్పటికీ ఇంటి నుండే పని చేస్తున్నారు .
ఇటీవల బెంగుళూరు (Bengaluru)సాఫ్ట్వేర్ ప్రపంచంగా మారింది . వర్క్‌ఫ్రమ్‌హోమ్ (work from home)ఎంప్లొయ్ ఒకరు లాప్టాప్ తోసహా థియేటర్ కి వచ్చాడు . అటు సినిమా చూస్తూ వర్క్ చేసుకుంటున్నాడు .థియేటర్ లో లైట్స్ ఆఫ్ అయ్యాక అతని లాప్టాప్ కాంతి మాత్రమే రావటంతో ఏంటా అని చూసిన కొంతమంది అతని పని తీరు చూసి ఏమి తెలివి బాసు !నీది అనుకుంటున్నారు . ఇదంతా చూస్తున్న ఒక యువకుడు అతను సినిమా చూస్తూ థియేటర్ లో వర్క్ చేయటాన్ని మొబైల్ లో వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసేసాడు ..ఇంకేముంది గంటల్లో ఈ వీడియో వైరల్ అయింది . బెంగుళూరు మళయాళీస్(benguluru Malayali's) అనే పేజీలో ఈ వీడియో పోస్ట్ చేస్తూ బెంగుళూరులో (Bengaluru)కొత్తదనం కనిపిస్తుంది అంటూ కాప్షన్ రాశాడు ..
ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు . సినిమా ఎంజాయ్ చేయకుండా ..చీకట్లో కూడా వర్క్ ఏంటి బ్రో ?అని ఒకరు .. నీ వర్క్‌ఫ్రమ్‌హోమ్ భలే మేనేజ్ చేస్తున్నావ్ ! అంటూ మరొకరు .. థియేటర్ లో మిగిలిన జనానికి ఏంటి ఈ ఇబ్బంది అంటూ మరొకరు ఇలా రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు .