పెళ్లికి వచ్చిన అతిధులకు ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే డ్రింక్స్ గా ఇస్తామని చెప్పింది. అంతేకాదు తనకు . తనకు కాబోయే భర్తకు డ్రింక్ చేసే అలవాటు లేదని... కనీసం కాఫీ కూడా తాగబోమని ఆ యువతి పోస్టులో తెలిపింది.

డ్రై డే గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ డ్రై డే రోజు ఆల్కహాల్ ముట్టకుండా ఉండటమే డ్రై డే (Dry day ).. అయితే ఇప్పుడు డ్రై వెడ్డింగ్ గురించి విన్నారా ? అంటే పెళ్లి( wedding)లో ఆల్కహాల్ లేకుండా పెళ్లి కార్యక్రమం ముగించడం అన్నమాట . ఇప్పుడు ఈ డ్రై వెడ్డింగ్ గురించే హాట్ టాఫిక్ గా మారింది. కొన్ని కొన్ని పెళ్లి వేడుకల్లో డ్రింక్స్ సర్వ్ చేయడం కామన్ కానీ తమ పెళ్లికి మాత్రం ఫిల్టర్ వాటర్ నే డ్రింక్ గా ఇస్తామంటూ .... సోషల్ ప్లాట్ ఫాం రెడిట్ లో పెళ్లికూతురు చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఆల్కహాల్ మాత్రమే కాదట.. సాప్ట్ డ్రింక్స్ ( soft drinks ) కూడా పెళ్లిలో సర్వ్ చేయమని మోహమాటం లేకుండా కాబోయే ఈ జంట క్లారీటీ ఇచ్చేసింది.

అయితే తమ పెళ్లి ( marriage ) లో లిక్కర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ...అంత ఖర్చు చేసే పరిస్థితి తమకు లేదని చెప్పుకొచ్చారు. పెళ్లికి వచ్చిన అతిధులకు ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే డ్రింక్స్ గా ఇస్తామని చెప్పింది. అంతేకాదు తనకు . తనకు కాబోయే భర్తకు డ్రింక్ చేసే అలవాటు లేదని... కనీసం కాఫీ కూడా తాగబోమని ఆ యువతి పోస్టులో తెలిపింది.

పండుగల సమయంలో తప్ప మామూలు సందర్భాల్లో జ్యూస్, సోడా వంటి వాటిని కూడా ముట్టుకోమని చెప్పింది. అందుకే, తమ పెళ్లి( marriage ) లో ఆల్కహాల్‌ని ఆఫర్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వివాహానికి అయ్యే ఖర్చును నేను, నా భర్త పెట్టుకుంటున్నాం. పెళ్లి ఖర్చులో కొంత భాగం మా అమ్మమ్మ భరించనుంది. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతోనే పెళ్లిలో ఆల్కహాల్‌ వద్దని నిర్ణయం తీసుకున్నాం’ అని పోస్టులో తెలిపింది.

అయితే తన కుటుంబంతో పాటు తనకు కాబోయే భర్త (Husband ) కుటుంబం చాలా పెద్దదని చెప్పుకొచ్చింది. తమ పెళ్లికి దాదాపు 150 మంది వరకు అతిథులు వస్తారని ..వీరికి ఆల్కహాల్‌(alcohol)తో పాటు ఇతర బేవరేజెస్‌ సరఫరా చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని అయితే, ఫుడ్ విషయంలో రాజీ పడేదే లేదు. ఎన్నో రకాలు వంటకాలు వడ్డించనున్నాం. ఇందుకోసం భారీగా వెచ్చించాలని నిర్ణయించాం’ అని రెడిట్ పోస్టులో పెళ్లికూతురు తెలిపింది.

అయితే కాబోయే ఈ జంట తమ నిర్ణయాన్ని వెల్లడించగానే చాలామంది బంధువులు ఆశ్చర్య పోయారట.... పెళ్లి(marriage )లో ఆల్కహాల్‌ లేకపోవడం ఏంటని... ఇలాంటి పెళ్లి బోరింగ్ అంటూ చెప్పుకొచ్చారట. కనీసం సోడా అయినా ఇస్తే బాగుంటుంది అని సూచించినట్లు పెళ్లికూతురు చెప్పుకొచ్చింది . నెటిజన్లు మాత్రం కాబోయే కపుల్ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని మద్దతు ఇస్తున్నారు. కొందరైతే వివిధ సూచనలు చేస్తున్నారు. పెళ్లికి వచ్చే అతిథులు సొంత డబ్బులతో ఆల్కహాల్ తెచ్చుకోవాలన్న కండీషన్ పెడితే బాగుంటుందని ఓ యూజర్ సూచించాడు.

Updated On 24 March 2023 4:41 AM GMT
Ehatv

Ehatv

Next Story