అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. 1909 అంటే సరిగా వందేళ్ళ క్రితంవేరు వేరు దేశాలలోని వివిధ చోట్ల మహిళలు తమ హక్కుల కోసం శాంతి పోరాటాలు ర్యాలీలు నిర్వహిస్తూ పోరాడుతూ ఉండేవారు.. కష్టానికి ఫలితంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు..ఐక్యరాజ్యసమితి 1957 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది . జాతి,మత,సంస్కృతీ ,ప్రాంత భేషజాలు లేకుండా మహిళా శక్తి ని గుర్తించటానికి ఏడాదిలో ఒక రోజు మహిళా దినోత్సవం గా ప్రకటించింది . […]

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

1909 అంటే సరిగా వందేళ్ళ క్రితంవేరు వేరు దేశాలలోని వివిధ చోట్ల మహిళలు తమ హక్కుల కోసం శాంతి పోరాటాలు ర్యాలీలు నిర్వహిస్తూ పోరాడుతూ ఉండేవారు.. కష్టానికి ఫలితంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు..ఐక్యరాజ్యసమితి 1957 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది . జాతి,మత,సంస్కృతీ ,ప్రాంత భేషజాలు లేకుండా మహిళా శక్తి ని గుర్తించటానికి ఏడాదిలో ఒక రోజు మహిళా దినోత్సవం గా ప్రకటించింది . 1977 లో మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని అన్ని దేశాల మద్దతు ప్రకటించాయి .

కష్టపడి పోరాటం చేసి హక్కుల కోసం పోరాడారు కానీ హక్కులను అమలు చేసుకునే విధానంలో మహిళలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు.ఇది బ్రతుకు పోరాటం చేస్తున్న సాధారణ మహిళల గొంతు..అంతరిక్షానికి సైతం ఆడది వెళ్ళగలుగుతుంది . విమానాలను సైతం నడపగలుతుంది. దేశ రాజకీయాలలో ,విద్య ,వైద్య,విజ్ణాన ఇలా ప్రతి రంగంలో విజయాలు సాధించిన మహిళా కథలు విన్నాం వాళ్ళని చూస్తున్నాం. కానీ ప్రస్తుత సమాజం లో సాధారణ మహిళకు మాత్రం లేదు దైర్యం .

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! ఇది అందరికి తెలిసిందే ! కానీ అసలు స్త్రీలు ఇప్పటికి కోల్పోతున్న విలువలు వారి అవసరాలు ఏంటో తెలుసుకుందాం ..

పురుషాధిక్య ప్రపంచంలో ఆడవాళ్లకు మగవాళ్ళకి అన్ని వేళల సమన్యాయం అనేది ఎక్కడ జరగటం లేదు. పలుకుబడి డబ్బుతో ఆడవాళ్లకు జరగాల్సిన న్యాయం కళ్ళు మూసికొని పోతుంది. ఇందుకు ఉదాహరణగా మన కళ్ళు ముందు చూస్తున ఎన్నో ఘటనలు ప్రస్తుత ప్రీతీ కథే దీనికి నిదర్శనం .

గౌరవం.. ఆడవాళ్ళకి దక్కాల్సిన మరో హక్కు ఇది. పని చేసేచోట ,ఇళ్లలో ప్రతి చోట స్త్రీ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లిన అది నేరం గా పరిగణించాలి .

చట్టాల్లోని పౌరసత్వం లోనో మహిళకు హక్కుల గురించి రాసిన ప్రతి ఇంట్లో ఉండే మహిళకు మాత్రం ఎలాంటి ప్రత్యేక మైన హక్కులు ఉండవు.చెప్పాలంటే బంధాల్లో బందీగా ఉండటం తప్ప వ్యక్తిగతస్వేచ్ఛ ఉండదు .

లైంగికవేధింపులు ,మానసిక వేధింపులు ,అత్యాచారాల మధ్య నలిగిపోతున్న మహిళల ,చిన్నారుల జీవితానికి భరోసా ఏది ?

వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరిస్తూ పైకి చెప్పుకోలేని గొంతులు ,కుటుంబాల కట్టుబాట్ల,బానిసత్వాన్ని మోస్తున్న మహిళలు ఎంత మందో
తమ సమస్యను సైతం బయటకు చెప్పుకోలేక పోతున్నారు .

ఇలా మహిళలు కోల్పోతున్న విలువలు ,గౌరవరం ,న్యాయ హక్కుల గురించి భాద్యత తీసుకునేది ఎవరు ?

మహిళ అరాచకాలకు అణిచేది ఎవరు?

Updated On 7 March 2023 5:49 AM GMT
Ehatv

Ehatv

Next Story