ఇదో అభినవ సావిత్రి కథ(Savitri Story). భర్త ప్రాణాలను కాపాడేందుకు అపర కాళికలా మారిన ఓ మహిళ కథ. రాజస్తాన్‌(Rajastan)లో కరౌలీ జిల్లా(Karauli District) మండరాయల్‌ సబ్‌ డివిజన్‌లో జరిగిన ఘటన ఇది. మేకల దాహాన్ని తీర్చడానికి 29 ఏళ్ల బనీసింగ్‌ మీనా అనే వ్యక్తి చంబల్‌ నది తీరానికి వెళ్లాడు. తనకు కూడా దాహం వేయడంతో నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు నీటి మాటున నక్కి ఉన్న మొసలి ఒక్క ఉదుటన లేచి బనీసింగ్‌పై దాడికి దిగింది. అతడి కాలిని నోట కరచుకుని నీటి లోపలికి లాక్కొనేందుకు ప్రయత్నించింది

ఇదో అభినవ సావిత్రి కథ(Savitri Story). భర్త ప్రాణాలను కాపాడేందుకు అపర కాళికలా మారిన ఓ మహిళ కథ. రాజస్తాన్‌(Rajastan)లో కరౌలీ జిల్లా(Karauli District) మండరాయల్‌ సబ్‌ డివిజన్‌లో జరిగిన ఘటన ఇది. మేకల దాహాన్ని తీర్చడానికి 29 ఏళ్ల బనీసింగ్‌ మీనా అనే వ్యక్తి చంబల్‌ నది తీరానికి వెళ్లాడు. తనకు కూడా దాహం వేయడంతో నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు నీటి మాటున నక్కి ఉన్న మొసలి ఒక్క ఉదుటన లేచి బనీసింగ్‌పై దాడికి దిగింది. అతడి కాలిని నోట కరచుకుని నీటి లోపలికి లాక్కొనేందుకు ప్రయత్నించింది. ఊహించని ఈ ఘటనతో బనీసింగ్‌ బిత్తరపోయాడు. గట్టిగా కేకలు వేశాడు. కొంచెం దూరంలో మేకలు కాస్తున్న అతడి భార్య విమలాబాయికి భర్త కేకలు వినిపించాయి. పరుగున అక్కడికి వచ్చింది. పరిస్థితిని చూసి బెంబేలుపడింది. అంతలోనే తేరుకుని ఎలాగైనా సరే భర్తను రక్షించుకోవాలనుకుంది. నదికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై బాదడం మొదలుపెట్టింది. ఆ దెబ్బలకు తాళలేక మొసలి బనీసింగ్‌ కాలు వదిలేసి నీటిలోకి వెళ్లిపోయింది. అప్పుడు చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారు అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 'ఎదురుగా చావు కనిపించింది. నా భార్య తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడింది. కాస్త ఆలస్యమైనా నా ప్రాణాలు పోయేవి' అని బనీసింగ్‌ అన్నాడు. అతడి మాటల్లో భార్య పట్ల కృతజ్ఞతా భావం కనిపించింది. 'తన భర్త చావు ముంగిట ఉన్నాడన్న విషయం తెలుసు. ఎలాగైనా సరే తన భర్తను కాపాడుకోవాలనుకున్నా. అందుకే ఏ మాత్రం భయపడకుండా మొసలిపై దాడికి దిగా' అని విమలాబాయి తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందరూ విమలను తెగ మెచ్చుకుంటున్నారు.

Updated On 12 April 2023 11:24 PM GMT
Ehatv

Ehatv

Next Story