Viral Video : లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన మహిళలు.. జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు..!
కోల్‌కతా లోకల్ ట్రైన్‌లో మహిళలు రెచ్చిపోయారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ, లాగుతూ కనిపించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కోల్‌కతా లోకల్ ట్రైన్‌లోని మహిళల కోచ్‌లో మహిళలు

Women Crossed All Limits In Kolkata Local Trains Made Ruckus Viral Video
కోల్‌కతా(Kolkata) లోకల్ ట్రైన్(Local Train)లో మహిళలు రెచ్చిపోయారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ, లాగుతూ కనిపించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో(Video) సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతోంది. ట్విట్టర్(Twitter)లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కోల్‌కతా లోకల్ ట్రైన్(Kolkata Local Train)లోని మహిళల కోచ్‌లో మహిళలు ఒకరిపై ఒకరు అరుస్తూ కనిపించారు. అంతే కాదు వారి మధ్య పోరు ముదిరి పాకాన పడే సరికి అదికాస్తా పరిమితి దాటింది. దీంతో ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం, జుట్టు లాగడం మొదలుపెట్టారు.
Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L
— Ayushi (@Ayushihihaha) July 11, 2023
రైలు(Train)లోని ఇతర ప్రయాణికులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. అయినా వారు పోట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ గొడవ వెనుక అసలు కారణం ఏమిటనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే.. వీడియో చివరిలో మాత్రం మహిళ అబ్బాయిలలో ఒకరిని కొట్టడం చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ప్రజల స్పందిస్తున్నారు. ముంబై లోకల్ ప్రో వెర్షన్(Mumbai Local Pro Version) అని ఓ నెటిజన్ రాశాడు. రైలులో ఉచిత WWE అని ఒకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ ఈ వీడియో షాంపూ బ్రాండ్(Shampoo Brand)కు కరెక్ట్‌గా సరిపోతుందని రాసింది.
