Woman Walking On Narmada River:నర్మదానది పైన నడిచిన మహిళ... దేవత అనుకోని పూజలు అసలు విషయం తెలిసాక మాత్రం.?
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh)జబల్‌పూర్(Jabalpur) జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది . గ్రామంలో ప్రవహించే నర్మదా నది నీటిపై ఒక మహిళ నడుస్తున్నవీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ (viral)అయ్యింది ,అక్కడ స్థానికులు ఆమెను 'దేవత' గా భావించి మొక్కడం ,పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆమె పేరు జ్యోతి రఘువంశీ(Jyothi Raghu Vamshi) . సోషల్ మీడియాలో ఈ వీడియో పాపులర్ కావటంతో చుట్టుపక్కల జనాలు ఈమెను చూడటానికి ఎగబడుతున్నారు . నదిలో నడుస్తున్న ఈమెను చూసి అక్కడి జనం నర్మదానది దేవత ఆమెనని కొనియాడుతున్నారు .

"తిల్వారా ఘాట్ వద్ద నర్మదానది నీటిపై నడుస్తున్న మహిళ" (women walking on Narmada river at Tilvara Ghat)అనే క్యాప్షన్‌తో ఒక వ్యక్తి ఈమె నీటిలో నడిచిన వీడియోని ఇంటర్నెట్లో పెట్టగా అందరికి ఈ విషయం తెలిసింది . ఈ మహిళా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. చూసిన వారు ఆ మహిళను భగవత్ స్వరూపంగా భావిస్తూ పూజలు చేస్తున్నారు
ఆ ప్రాంత ప్రజలు డప్పులు వాయిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ప్రార్ధనలు చేస్తూ గుమికూడడంతో పోలీసులు నర్మదా నది ఒడ్డుకు చేరుకుని విచారణ చేయటం మొదలుపెట్టారు .ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు ఆ మహిళ నర్మదా నదిపై నిజంగానే నడిచిందా?అని పోలీసులు ఆమెను ప్రశ్నించగా జ్యోతి రఘువంశీ తాను నర్మదా నదీ(Narmada River)నీటిపై నడవలేదని చెప్పడం అక్కడున్న వారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.తాను నర్మదాపురంలో నివాసం ఉంటున్నానని, 10 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయానని ఆ మహిళ పోలీసులకు తెలిపింది.నర్మదా నదిపై నడిచిన మహిళ మిస్టరీ ఈ విధంగా వీడింది.
ఇంతకు అసలు విషయం ఏమిటంటే ?నర్మదానది (Narmada River) నీటిమట్టం చాలాచోట్ల తక్కువుగా ఉంటుంది. జ్యోతి(Jyothi) నది ఒడ్డున భక్తితో నర్మదా నదికి ప్రదక్షిణాలు చేసే క్రమంలో అక్కడ చాలాసేపు నడిచింది . ఎక్కువ లోతు వైపు అసలు ఆమె వెళ్ళలేదు . ఇదంతా చుసిన ఒక వ్యక్తి దీన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ న్యూస్ చేసాడు .అసలు విషయం తెలుసుకొని అందరు నిట్టురుస్తున్నారు . పోలీసులు జ్యోతి కుటుంబీకులను సంప్రదించి ఆమెను ఇంటి వద్ద దింపడం జరిగింది.