వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల(YS Sharmila) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్నది పాత వార్తే! షర్మిల, అనిల్‌కుమార్‌( Brother Anil Kumar) దంపతుల కుమారుడు వై.ఎస్‌.రాజారెడ్డి(YS Raja reddy) వివాహ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రియా అట్లూరి(Priya atluri), రాజారెడ్డి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. లేటెస్ట్‌గా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ(YS Vijayalakshmi) చీర పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల(YS Sharmila) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్నది పాత వార్తే! షర్మిల, అనిల్‌కుమార్‌( Brother Anil Kumar) దంపతుల కుమారుడు వై.ఎస్‌.రాజారెడ్డి(YS Raja reddy) వివాహ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రియా అట్లూరి(Priya atluri), రాజారెడ్డి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. లేటెస్ట్‌గా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ(YS Vijayalakshmi) చీర పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రియ అట్లూరి అమెరికాలో(America) మాస్టర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రియ తాత అట్లూరి ప్రసాద్‌ ఉభయ రాష్ట్రాలలో పేరుపొందిన ఛట్నీస్‌(Chutneys) రెస్టారెంట్‌ నిర్వాహకులు. రాజారారెడ్డి తండ్రి అనిల్‌ మధ్వా బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు. అనిల్- షర్మిలది కూడా ప్రేమ వివాహమే! షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత అనిల్‌ క్రైస్తవమతంలోకి మారారు. ప్రస్తుతం అనిల్‌ మతబోధకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య జగన్‌(YS Jagan) పెద్ద కూతురును రాజారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అది కేవలం ప్రచారానికే పరిమితమయ్యింది. బహుశా మేనరికపు పెళ్లిళ్లు మంచివి కావని అనుకున్నారు కాబోలు. ఇప్పుడైతే జగన్మోహన్‌రెడ్డి, షర్మిల మధ్య మాటలు లేవని అంటున్నారు. అయితే రాజారెడ్డి పెళ్లిని(Marriage) జగన్‌ దగ్గరుండి జరిపించబోతున్నారట! తన నివాసంలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లితో అన్నాచెల్లెళ్ల అనుబంధం మళ్లీ బలపడే అవకాశం ఉందని వైఎస్‌ అభిమానులు ఆశపడుతున్నారు. అయితే జగన్‌కు ఇప్పటి వరకు పెళ్లి ఆహ్వానం(Invitation) అందలేదని, బహుశా జగన్ పెళ్లికి హాజరుకాకకపోవచ్చని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా పెళ్లి కంటే ఆ పెళ్లికి జగన్‌ వెళతారా? వెళ్లరా? అన్నదే ఆసక్తిగా మారింది.

Updated On 13 Dec 2023 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story