Wife Sell Husband : భర్తను అయిదు లక్షలకు మరో మహిళలకు అమ్మేసిన భార్య
శుభలగ్నం (Subhalagnam) సినిమా చూశారా? అందులో ఆమని తన భర్త జగపతిబాబును కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. అచ్చంగా ఈ సినిమాలో జరిగినట్టే కర్ణాటకలో జరిగింది. తన భర్తను అయిదు లక్షల రూపాయలకు మరో మహిళకు విక్రయించిందో భార్యామణి. మండ్య సమీప గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని భార్య గుర్తించింది. వారిద్దరూ బెడ్‌పై ఉన్నప్పుడు నేరుగా నిలదీసింది. ఆమెతో గొడవపెట్టుకుంది. ఈ గొడవ కాస్తా […]
శుభలగ్నం (Subhalagnam) సినిమా చూశారా? అందులో ఆమని తన భర్త జగపతిబాబును కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. అచ్చంగా ఈ సినిమాలో జరిగినట్టే కర్ణాటకలో జరిగింది. తన భర్తను అయిదు లక్షల రూపాయలకు మరో మహిళకు విక్రయించిందో భార్యామణి. మండ్య సమీప గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని భార్య గుర్తించింది. వారిద్దరూ బెడ్‌పై ఉన్నప్పుడు నేరుగా నిలదీసింది. ఆమెతో గొడవపెట్టుకుంది. ఈ గొడవ కాస్తా పంచాయితీ వరకు చేరింది. అక్కడ ఇద్దరు ఆడవాళ్ల మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. 'నీ భర్త నా దగ్గర అయిదు లక్షలు తీసుకున్నాడు. ఆ అయిదు లక్షలు ఇచ్చేసి నీ భర్తను పట్టుకెళ్లు' అని ఆ మహిళ చెప్పింది. 'అలాంటి భర్తను ఏలుకోడానికి నేనేమీ రెడీగా లేను. నాకే అయిదు లక్షల రూపాయలు మనోవర్తి ఇచ్చి అతడిని నువ్వే ఉంచుకో' అని ఇల్లారు చెప్పింది. తనకో నెల రోజులు టైమ్ ఇస్తే అయిదు లక్షలు ఇస్తానని మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి అంగీకరించింది. అక్కడే వీరిద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు. మహిళలు కుదుర్చుకున్న రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, వచ్చిన గ్రామస్తులు బిత్తరపోయారు.