చుక్కలను దాటిపోయిన టమాటా(tomato) ధరలు సామాన్యులను బెంబేలెత్తించడమే కాదు, పచ్చటి కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) షాహ్‌డోల్‌ జిల్లాలో ఇదే జరిగింది. టమాటాల కారణంగా భార్యభర్తలు గొడవపడ్డారు. ఆ గొడవ ముదరడంతో భార్య కూతురుతో పాటు ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో భర్త కగారుపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు

చుక్కలను దాటిపోయిన టమాటా(tomato) ధరలు సామాన్యులను బెంబేలెత్తించడమే కాదు, పచ్చటి కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) షాహ్‌డోల్‌ జిల్లాలో ఇదే జరిగింది. టమాటాల కారణంగా భార్యభర్తలు గొడవపడ్డారు. ఆ గొడవ ముదరడంతో భార్య కూతురుతో పాటు ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో భర్త కగారుపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాపం పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని మొగుడుపెళ్లాల మధ్య సయోధ్య కుదిర్చారు. దాంతో కథ సుఖాంతమయ్యింది. అసలేం జరిగిందంటే సంజీవ్‌ వర్మన్‌(Sanjeev Varman) టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుంటాడు. వంటలు చేస్తున్నప్పుడు కూరలో టమాటాలు వాడాడు. ఇది చూసిన భార్య ఆరతికి కోపం వచ్చేసింది. భర్తను తిట్టిపోసింది.

ఇకపై ఇలాంటి తప్పు జరగదని, భవిష్యత్తులో టమాటాల జోలికి వెళ్లనని ప్రామిస్‌ చేశాడు భర్త. అయినా భర్త మాటపై విశ్వాసం లేని భార్య ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన సంజీవ్‌ తన భార్యను వెతికేందుకు పోలీసుల సాయం కోరాడు. దీంతో పోలీసులు సంజీవ్‌ నుంచి అతడి భార్య ఆరతి ఫోన్‌ నంబర్‌ తీసుకుని ట్రేస్‌ చేశారు. ఆరతి ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆలుమగల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్ అధికారి సంజయ్‌ జైశ్వాల్‌ ఈ సంఘటన గురించి చెబుతూ, ఆరతి వర్మతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు టమాటాల ప్రస్తావన వచ్చినప్పటికీ తన భర్త రోజూ తాగేసి వచ్చ తనను, కూతురును కొడుతుంటాడని ఆరతి ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్‌, ఆరతిలకు ఎనిమిదేళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి నాలుగేళ్ల కూతురుంది. దేశంలో టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టమాటాల కొనుగోలు విషయంపై పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Updated On 13 July 2023 3:54 AM GMT
Ehatv

Ehatv

Next Story