జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేతికి ఈ మధ్య రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి. పవన్ తన కుడి చేతి వేళ్లకు ఒకటి తాబేలు(Tortoise) ఉంగరం, రెండోది నాగ ప్రతిమ(Snake) ఉంగరం ధరిస్తున్నారు. పవన్ వేదికపై మాట్లాడే సమయంలో ఈ ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వీటిపై ఓ జాతక నిపుణుడు(Astrologer) వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ జాతకం పరంగా చూస్తే... ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2. కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి.

జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేతికి ఈ మధ్య రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి. పవన్ తన కుడి చేతి వేళ్లకు ఒకటి తాబేలు(Tortoise) ఉంగరం, రెండోది నాగ ప్రతిమ(Snake) ఉంగరం ధరిస్తున్నారు. పవన్ వేదికపై మాట్లాడే సమయంలో ఈ ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వీటిపై ఓ జాతక నిపుణుడు(Astrologer) వివరణ ఇచ్చారు. "పవన్ కల్యాణ్ జాతకం పరంగా చూస్తే... ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2. కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి. ఆయనది మకర రాశి(Makara Rashi). మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు. చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ, కుజ రాహువు సంధి ప్రభావం ఉండడం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం. జాతకపరంగా(Astrology) ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఇబ్బందులు(Family Problems) ఉన్నవారు, నర ఘోష, నర దృష్టి ఎక్కువగా ఉన్నవారు, రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారు. రెండోది కూర్మావతార ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది. ఎదుగుదలకు, అధికారానికి, ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష శాస్త్రంలో చెబుతారని వివరించారు. ఇవే కాకుండా మద్యమద్యలో పవన్ పెద్ద పగడపు ఉంగరం(Coral ring) కూడా ధరిస్తూ ఉంటారు. కనీసం 4 కారెట్ల బ‌రువు ఉన్న ఉంగరాన్ని పవన్ ధరిస్తూ ఉంటారు. జాతకరీత్యా ఆ ఉంగరాన్ని ధరిస్తే రాజ‌కీయంగా(Political) క‌లిసొస్తుంద‌ని జ్యోతిష్యులు సూచించార‌ని స‌మాచారం. నిజంగానే పవన్ కళ్యాణ్ కి ఆభరణాలపై మోజుంటే ఖరీదయిన వజ్రలాంటివి ధరిస్తారు కానీ ఖరీదు తక్కువైన పగడం ధరించరు. అంత పెద్ద పగడపు ఉంగరం ధరించారు అంటే అది ఖచ్చితంగా జాతక దోషాల నివరణకే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Updated On 25 March 2024 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story