ఫూల్స్ డే(foolsday ) అనగా 'ఏప్రిల్ ఫూల్స్ డే' ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఫ్రెండ్స్ ను, సన్నిహితులను లేదా కుటుంబ సభ్యులను ఫూల్స్ ని చేస్తూ ఆటపట్టిస్తారు . ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ ఫూల్స్ డే ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు . తోటివారితో చిలిపిగా జోకులు (jokes )వేస్తూ తర్వాత నవ్వుకుంటూ ఉత్సాహంగా ఏప్రిల్ ఫూల్స్ డే(April Fool Day ) అని అరుస్తారు.అయితే ఎవరిని నొప్పించకుండా సున్నితమైన హాస్యంతో జరిపే చిలిపి పనులను మాత్రమే చేయడం మంచిది.

ఫూల్స్ డే(foolsday ) అనగా 'ఏప్రిల్ ఫూల్స్ డే' ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఫ్రెండ్స్ ను, సన్నిహితులను లేదా కుటుంబ సభ్యులను ఫూల్స్ ని చేస్తూ ఆటపట్టిస్తారు . ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ ఫూల్స్ డే ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు . తోటివారితో చిలిపిగా జోకులు (jokes )వేస్తూ తర్వాత నవ్వుకుంటూ ఉత్సాహంగా ఏప్రిల్ ఫూల్స్ డే(April Fool Day ) అని అరుస్తారు.అయితే ఎవరిని నొప్పించకుండా సున్నితమైన హాస్యంతో జరిపే చిలిపి పనులను మాత్రమే చేయడం మంచిది.

ఇంతకుముందు ఈ ఏప్రిల్ 1రోజును ఫ్రాన్స్ (France )మరియు కొన్ని ఇతర యూరోపియన్ (Europiean ) దేశాలలో మాత్రమే జరుపుకునేవారు, కానీ క్రమంగా ఏప్రిల్ ఫూల్స్ డేని ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడంప్రారంభించాయి . 'ఏప్రిల్ ఫూల్స్ డే' (1 ఏప్రిల్) జరుపుకోవడం వెనుక చాలా కథలుప్రచారంలో ఉన్నాయి.కానీ బలమైన చారిత్రక కారణాలు అయితే ఏమి లేవు . అలాంటివాటిలో వాడుకలో ఉన్న ఈ రోజు చరిత్రను(History ) తెలుసుకుందాం...

ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా మొదలైంది
ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్స్ డే(April Fool Day) ఎందుకు జరుపుకుంటారు అనేదానికి బలమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ, దాని గురించి చాలా కథనాలు ఉన్నాయి. అందులో ఒకదాని ప్రకారం, ఏప్రిల్ ఫూల్స్ డే 1381లో ప్రారంభమైంది. ఆ సమయంలో కింగ్ రిచర్డ్ (king Richard) బొహేమియా రాణి ని మార్చి 32, 1381న నిశ్చితార్థం( Engagement )చేసుకోబోతున్నట్లు ప్రకటించటం జరిగింది . నిశ్చితార్థం వార్త విని, ప్రజలు మొదట ఎంతో సంతోషించారు, కానీ మార్చి 31, 1381 తో నెల ముగుస్తుంది ఈ మార్చి 32 అస్సలు రాదని ప్రజలు అర్థం చేసుకుని . దాంతో వాళ్ళఅందరు మోసం పోయామని అనుకున్నారు . అప్పటి నుంచి మార్చి 32, అంటే ఏప్రిల్ 1వ తేదీని ఫూల్స్ డేగా జరుపుకుంటున్నారని ఒక కథ ప్రచారం లో ఉంది . కొన్ని కథనాల ప్రకారం, ఏప్రిల్ ఫూల్స్ డే అప్పటికే 1392లో ప్రారంభమైందని .అందుకే 'ఏప్రిల్ ఫూల్స్ డే'ని జరుపుకుంటారు అని చెప్తుంటారు

కొన్ని కథనాల ప్రకారం,యూరోపియన్ దేశాల్లో నూతన సంవత్సరాన్ని మొదటిసారిగా ఏప్రిల్ 1వ తేదీన జరుపుకునే వారు . కానీ, పోప్ గ్రెగొరీ 13 కొత్త క్యాలెండర్‌ను పాటించాలని ఆదేశించడంతో, కొత్త సంవత్సరం(New Year )జనవరి 1 నుండి జరుపుకోవడం ప్రారంభమైంది. కొంతమంది ఇప్పటికీ ఏప్రిల్ 1వ తేదీనే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. అప్పుడు అలాంటి వారిని మూర్ఖులుగా అంటూ ఎగతాళిచేసేవారట . ఏప్రిల్ ఫూల్స్ డే (April Fool Day)ఇలా మొదలైంది. అయితే, 19వ శతాబ్దం నాటికి, ఏప్రిల్ ఫూల్స్ డే బాగాపాపులారిటీ ని సంపాదించుకుంది . .

భారతదేశంలో(India ) ఎప్పుడు ప్రారంభమైంది?
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆఫ్రికన్ దేశాల గురించి మాట్లాడితే అక్కడ ఏప్రిల్ ఫూల్స్ డే(April Fool Day) 12 గంటల వరకు మాత్రమే జరుపుకుంటారు. అదే సమయంలో, కెనడా, అమెరికా, రష్యా మరియు ఇతర యూరోపియన్ దేశాలలో ఏప్రిల్ 1 న రోజంతా ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటారు.ప్రస్తుతం భారతదేశంలో కూడా, ప్రజలు ఈ రోజున సరదాగా జోకులు(jokes) వేసుకుంటూ సమయాన్ని ఆనందం గా గడుపుతారు

Updated On 1 April 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story