వామ్మో నా జుట్టు ఊడుతుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్(Hair fall) అనేది టీనేజీ(Teenage) అమ్మాయిలను వెంటాడే అతిపెద్ద సమస్య(Problem). ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం సర్వసాధాణమైపోయింది. అలా జుట్టు రోజు రాలిపోతుంటే..సహజంగానే ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా(Healthy) ఉన్నా జుట్టు ఉన్నట్టుండి రాలిపోతుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో మాత్రం అర్థం కాదు. అయితే దీనికి కరకరాల కారణాలు చెబుతున్నారు డాక్టర్లు(Doctors). మనిషికి జుట్టు చాలా అందాన్నిస్తుంది(Beauty). ఎదుటివారికి మరింత అందంగా కనిపించాలంటే మన జుట్టు ముఖ్యపాత్ర(Important role) పోషిస్తుంది. కానీ.. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు, ఆడ, మగ ఎవరికైనా జుట్టు రాలిపోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇంతకీ జుట్టు ఎందుకు రాలుతుంది? జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది నిత్యం అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
వామ్మో నా జుట్టు ఊడుతుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్(Hair fall) అనేది టీనేజీ(Teenage) అమ్మాయిలను వెంటాడే అతిపెద్ద సమస్య(Problem). ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం సర్వసాధాణమైపోయింది. అలా జుట్టు రోజు రాలిపోతుంటే..సహజంగానే ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా(Healthy) ఉన్నా జుట్టు ఉన్నట్టుండి రాలిపోతుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో మాత్రం అర్థం కాదు. అయితే దీనికి కరకరాల కారణాలు చెబుతున్నారు డాక్టర్లు(Doctors).
మనిషికి జుట్టు చాలా అందాన్నిస్తుంది(Beauty). ఎదుటివారికి మరింత అందంగా కనిపించాలంటే మన జుట్టు ముఖ్యపాత్ర(Important role) పోషిస్తుంది. కానీ.. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు, ఆడ, మగ ఎవరికైనా జుట్టు రాలిపోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇంతకీ జుట్టు ఎందుకు రాలుతుంది? జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది నిత్యం అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
బరువు తగ్గడం చాలా మంది టీనేజీ అమ్మాయిల కల(Dream). ఈ మధ్య సన్నగా కనిపించడానికి టీనేజీ అమ్మాయిలు డైటింగ్(Dieting) చేయడం మామూలైపోయింది. ఈ పేరుతో కొంత మంది అమ్మాయిలు సరిగా తినడమే మానేశారు. కానీ, దీని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్(Side effects) కూడా ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది జుట్టు రాలడం. అసలు ఎందుకిలా జరుగుతుంది. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
నిజానికి ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు కూడా హెల్దీగా పెరుగుతుంది. తినే తిండిలోని పోషకాలు(Proteins), విటమిన్లు(Vitamins), ఎంజైమ్(Enzymes) సరిగ్గా ఉండటం చాలా అవసరం. శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని మిస్ అయినప్పుడు సరైన పోషకాలు అందవు. దాంతో క్రమేణా జుట్టు రాలిపోతుంది. లేదంటే జుట్టు సరిగ్గా పెరగదు. సో హెల్దీ డైట్ చాలా ముఖ్యమంటున్నారు డాక్టర్లు. తీసుకునే డైటికి, జుట్టు రాలడానికి మధ్య సంబంధం ఉంటుందనేది చాలా మందికి తెలియదు. సరైన న్యూట్రిషన్ ఫుడ్(Nutritious) తీసుకున్నప్పుడు జుట్టు ఊడిపోవడమనే సమస్య ఉండదంటున్నారు.
ఇక సరైన న్యూట్రిషన్ ఫుడ్ అంటే.. క్యాలరీలు(Calories), ప్రొటీన్లు, కొవ్వు(Fat), తగినన్ని, మైక్రో న్యూట్రియెంట్స్(Micro nutrients) ఉండాలన్నమాట. ఇవి పూర్తిగా శరీర కణాలు(Muscles), కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు డైటీషియన్స్(Dietitian). హెల్దీ డైట్(Healthy diet) బరువును తగ్గిస్తుందేగాని.. జుట్టు మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదని అంటున్నారు డాక్టర్లు.
అయితే వెయిట్ స్పీడ్‌గా తగ్గిపోవడం కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఒక్క నెలలో నాలుగు నుంచి ఐదు కిలోలకు మించి బరువు తగ్గితే మీరు సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం లేదన్నమాట. ప్రొటీన్, ఐరన్(Iron), విటమిన్ల లోపమే బరువును తగ్గించి, జుట్టు పెరగడంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. జుట్టు రాలుతోందని టెన్షన్(Tension) పడకుండా సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడంపై పూర్తి పోకస్(Focus) పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు.