Waltair Veerayya : వాల్తేరు వీరయ్య మరో రికార్డు
ఈ రోజుల్లో పట్టుమని పది రోజులు ఆడిన సినిమాలు కనిపించడం లేదు. హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా నెల రోజులలోపే దుకాణాలు కట్టేసుకుంటున్నాయి. అలాంటిది సంవత్సరం పాటు సినిమా ఆడటమంటే మాటలు కాదు. మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా ఈ ఘనతను సాధించింది.

Waltair Veerayya
ఈ రోజుల్లో పట్టుమని పది రోజులు ఆడిన సినిమాలు కనిపించడం లేదు. హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా నెల రోజులలోపే దుకాణాలు కట్టేసుకుంటున్నాయి. అలాంటిది సంవత్సరం పాటు సినిమా ఆడటమంటే మాటలు కాదు. మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా ఈ ఘనతను సాధించింది. నిరుడు సక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది. చిరంజీవితో పాటు రవితేజ(Ravi Teja) కూడా ఇందులో నటించాడు. శ్రుతిహాసన్(Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. 236 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి గత ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలతో విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య సినిమా నడుస్తూనే ఉంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది. ఇవాళ సాయంత్రం అంటే జనవరి 9వ తేదీన రామకృష్ణ థియేటర్‌లో చిరంజీవి అభిమానులు 365 రోజలు వేడుక చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
