యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయంచేస్తూ వస్తోంది వాట్సప్‌. పెరుగుతోన్న పోటీని సైతం తట్టుకొని వాట్సప్‌ సరి కొత్త ఉపాదాట్లు తో వినియోగదారులకు మరింత ఉపయోపడే విషయాలను పరిచయం చేస్తుంది. గోప్యత,భద్రత విషయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తున్న సోషల్ మీడియా అప్స్ లో టాప్ వాట్సాప్ .

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను(features) పరిచయంచేస్తూ వస్తోంది వాట్సప్‌(whatsapp). పెరుగుతోన్న పోటీని సైతం తట్టుకొని వాట్సప్‌ సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు మరింత ఉపయోపడే విషయాలను పరిచయం చేస్తుంది. గోప్యత,భద్రత విషయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తున్న సోషల్ మీడియా అప్స్ లో టాప్ వాట్సాప్ .

ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను(new feature) తీసుకొచ్చింది.ఇప్పటివరకు ఫోటోలు ,వీడియోస్ ద్వారా మీ ఇష్టాలను షేర్ చేసుకునే ఫీచర్ అందించిన వాట్సాఅప్ లో ఇప్పుడు వాయిస్‌ స్టేటస్‌(voice status) పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు వాయిస్‌ స్టేటస్‌ను షేర్‌ (share)చేసుకోవచ్చు. దీంతో వాయిస్‌ను స్టేటస్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ స్టేటస్‌ను ఎలా ఉపయోగించుకోవాలి..? వాయిస్‌ను మెసేజ్‌(voice message)ను స్టేటస్‌గా ఎలా సెట్ చేసుకోవచ్చు లాంటి వివరాలు మీకోసం..

* మొదటగా మీ స్మార్ట్‌ ఫోన్‌(smart phone)లో వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* అనంతరం స్టేటస్‌ విభాగంలోకి స్లైడ్‌(slide) చేయాలి.

* తర్వాత కుడిపైపు కనిపించే పెన్సిల్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే మైక్‌ సింబల్‌(mic symbol) వస్తుంది. దానిపై క్లిక్‌(click) చేసి మాటలు లేదా పాటలు లేదా సందేశం ఏదైనా రికార్డ్ చేయొచ్చు.

* ప్రెస్ బటన్ నొక్కి పట్టుకొని 30 సెకండ్ల వరకు ఆడియోను రికార్డ్‌ (audio record)చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది . .

* అనంతరం రికార్డ్‌ అయిన వాయిస్‌ను సెండ్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ స్టేటస్‌గా ఆడియో క్లిప్‌ చూపిస్తుంది.

ఇలా వాయిస్ స్టేటస్(voice status) తో కూడా వినియోగదారులు (users)తమ ఆనందాలను పంచుకొనే మరో అవకాశం ఇచ్చింది.ఇంకా మరి కొన్ని కొత్త features ని అందుబాటులోకి తీసుకు రావటానికి వాట్సాప్ మాతృ సంస్థ మెటా(meta) వినియోగదారులకు వినూత్న ప్రయత్నాలను చేస్తుంది .ఒక వేళా మీ ఫోన్ ఈ ఫెసిలిటీ కనిపించకపోతే మీ మొబైల్ (mobile)ని అప్డేట్ (update)చేయడం మర్చిపోవద్దు .

Updated On 23 March 2023 5:16 AM GMT
rj sanju

rj sanju

Next Story